Tag Archives: raghava lawrence

Radhika: నటి రాధికకు గోల్డ్ రింగ్ ప్రెసెంట్ చేసిన యంగ్ హీరో… ఎవరంటే?

Radhika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి రాధిక లారెన్స్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చంద్రముఖి 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

దాదాపు 15 సంవత్సరాల క్రితం చంద్రముఖి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు.ఇందులో నయనతార జ్యోతిక ప్రభు వంటి సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ కు బదులుగా లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. అలాగే జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాధిక కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Radhika: గోల్డ్ రింగ్, వాచ్…


ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో నటి రాధిక ఈ సందర్భంగా స్పందిస్తూ లారెన్స్ తనకు ఒక గోల్డ్ రింగ్ కానుకగా ఇచ్చారని తెలియజేశారు. అదేవిధంగా ఒక వాచ్ కూడా తనకు గిఫ్ట్ గా ఇచ్చారంటూ ఈ సందర్భంగా రాధిక తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా రాధిక లారెన్స్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్… ఏకంగా 150 మంది చిన్నారులను దత్తత!

Raghava Lawrence:తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా ఈయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ నిజజీవితంలో కూడా హీరోగా మంచి గుర్తింపు పొందారు.

ఇప్పటికే ఈయన రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా చదువులు చదివించడమే కాకుండా హార్ట్ సర్జరీలు కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.తాజాగా రాఘవ లారెన్స్ ఏకంగా 150 మంది చిన్నారులను దత్తత తీసుకొని వారి చదువులు ఇతర బాధ్యతలు అన్ని తనవేనని తెలియజేశారు.

ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక ఈ పిల్లలకు అభిమానుల ఆశీస్సులు కావాలని ఈయన ఆకాంక్షించారు. లారెన్స్ నటించిన రుద్రన్ తెలుగులో ఈ సినిమా రుద్రుడు పేరుతో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా లారెన్స్ ఈ విషయాన్ని తెలియజేశారు.

Raghava Lawrence: స్వామివారే ముందుకు నడిపిస్తున్నారు…

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు.. కేవలం తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలన్న తన తల్లి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే తాను నిజ జీవితంలో కూడా ఎంతోమంది చిన్నారులకు ఆసరాగా నిలబడ్డారని తెలుస్తోంది. ఇలా ఈయన 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారని తెలియడంతో నేటిజన్స్ ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Raghava Lawrence: గౌరవ డాక్టరేట్ అందుకున్న నటుడు రాఘవ లారెన్స్… సరైన అర్హుడు అంటూ ట్వీట్స్?

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన తమిళంలో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా డాన్సర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇలా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గత కొన్ని రోజుల నుంచి వెండితెరకు దూరంగా ఉన్నారు.

ఇకపోతే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలుగులో ఈయన నటించిన కాంచన, గంగ వంటి థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక చివరిగా శివగంగ అనే సినిమాతో ప్రేక్షకులను సందడి చేసిన రాఘవ లారెన్స్ త్వరలోనే రుద్రుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అదేవిధంగా వాసు దశకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంతో లారెన్స్ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్లో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లారెన్స్ సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఈయన ఎంతోమంది అనాధలను వికలాంగులను అంధులను చేరదీసి వారికి ప్రత్యేకంగా ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకుంటున్నారు.

లారెన్స్ స్థానంలో డాక్టరేట్ అందుకున్న లారెన్స్ తల్లి…

ఇకపోతే ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసిన లేదా సమస్యలలో ఉన్నారని తెలిసిన వెంటనే ఆదుకొని వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో మానవత్వంతో అందరికీ సహాయం చేస్తున్నటువంటి లారెన్స్ కి అరుదైన గౌరవం లభించింది. ఈయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్‌ ప్రకటించాయి.ఇక ఈ కార్యక్రమం ఆదివారం చెన్నైలో ఎంతో ఘనంగా జరిగింది. అయితే లారెన్స్ రుద్రుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఆయన స్థానంలో ఆ గౌరవాన్ని తన తల్లి అందుకున్నారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది అభిమానులు లారెన్స్ కు సరైన గౌరవం లభించింది అంటూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.