Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన తమిళంలో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా డాన్సర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇలా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గత కొన్ని రోజుల నుంచి వెండితెరకు దూరంగా ఉన్నారు.
ఇకపోతే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలుగులో ఈయన నటించిన కాంచన, గంగ వంటి థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక చివరిగా శివగంగ అనే సినిమాతో ప్రేక్షకులను సందడి చేసిన రాఘవ లారెన్స్ త్వరలోనే రుద్రుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అదేవిధంగా వాసు దశకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంతో లారెన్స్ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్లో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లారెన్స్ సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఈయన ఎంతోమంది అనాధలను వికలాంగులను అంధులను చేరదీసి వారికి ప్రత్యేకంగా ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకుంటున్నారు.
ఇకపోతే ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసిన లేదా సమస్యలలో ఉన్నారని తెలిసిన వెంటనే ఆదుకొని వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో మానవత్వంతో అందరికీ సహాయం చేస్తున్నటువంటి లారెన్స్ కి అరుదైన గౌరవం లభించింది. ఈయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్ ప్రకటించాయి.ఇక ఈ కార్యక్రమం ఆదివారం చెన్నైలో ఎంతో ఘనంగా జరిగింది. అయితే లారెన్స్ రుద్రుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఆయన స్థానంలో ఆ గౌరవాన్ని తన తల్లి అందుకున్నారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది అభిమానులు లారెన్స్ కు సరైన గౌరవం లభించింది అంటూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…