Tag Archives: Raghavendra

LB Sriram: ఏఎన్ఆర్ నాగార్జున సినిమాలకు అతనిని వద్దని నన్ను పెట్టుకున్నారు… దాసరి, రాఘవేంద్ర కొడతారేమోనని భయపడ్డాను: ఎల్బీ శ్రీరామ్

LB Sriram: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎల్బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనను కనపరిచిన ఈయన రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను దర్శకుడు క్రాంతి కుమార్ అన్ని సినిమాలకు తానే మాటలు రాస్తానని తెలిపారు. జయభేరి ప్రొడక్షన్స్ లో రాజేశ్వరి కళ్యాణం, వారసుడు సినిమాలు రెండు నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు తాను మాటలు రాయాలని చెప్పారు.రాజేశ్వరి కళ్యాణంలో ఏఎన్ఆర్ గారి నటించగా వారసుడు సినిమాలో కృష్ణ గారు నాగార్జున గారు నటిస్తున్నారు. ఇలా వీరిద్దరికీ డైలాగులు రాయడం అంటే సర్వసాధారణమైన విషయం కాదని తెలిపారు.

నిజానికి జయభేరి వాళ్లు ముందుగా ఈ రెండు సినిమాలకు డైలాగులు రాయడానికి గణేష్ పాత్రోని తీసుకున్నారు. అతనికి కొంతమేర అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆయనను కాదని ఆ సినిమాలో డైలాగులు రాయడానికి నన్ను తీసుకున్నారని ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు.ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఓ సినిమా కోసం ఈయన డైలాగులు రాసారని అయితే ఆ రోజు సినిమా షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి, క్లాప్ కొట్టడానికి ప్రముఖ దర్శకులైనటువంటి రాఘవేంద్రరావు దాసరి గారిని ఆహ్వానించారని తెలిపారు.

LB Sriram: దాసరి ప్రశంసలు కురిపించారు…


ఈ సినిమా ముహూర్తం షార్ట్ కాగానే ఆహా ఎంత శుభవార్త చెప్పవయ్యా దాసరి రాఘవేంద్ర అనే డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఇలా ఈయన డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయంతో చెట్టు చాటున దాక్కున్నానని తెలిపారు. ఈ సినిమా ఓపెనింగ్ దాసరి రాఘవేంద్రరావు రావడం అదే సమయంలో డైలాగ్ చెప్పడంతో వారిద్దరూ నన్ను కొడతారని ఫిక్స్ అయిపోయి దాక్కున్నానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.ఈ డైలాగ్ విన్నటువంటి దాసరి రాఘవేంద్ర రావు గారు ఎవరు అద్భుతంగా రాశారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పటికి నన్ను పిలిచి మన ఎల్బీ శ్రీరాం గారు ఈయన అద్భుతమైన రచయిత కానీ నోట్లో నాలుక లేదని రాజేంద్రప్రసాద్ పరిచయం చేయగా నాలుకను తీసి కలంలో పెడితే అతనికి నాలుక ఎక్కడుంటుంది అంటూ దాసరి చమత్కరించారంటూ ఎల్బీ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు.