Tag Archives: Rakshashudu

Chiranjeevi : కేజిఎఫ్ లాంటి షేడ్స్ ఉన్న కథను మెగా రాఖీ భాయ్ చిరంజీవి 36 ఏళ్ల క్రితమే దున్నాడు.?!

Chiranjeevi : ప్రస్తుత సినిమాలను లోతుగా గమనిస్తే..మనం ఎప్పుడో చూసిన పాత సినిమా గుర్తుకువస్తుంటుంది. సినిమా టేకింగ్, కెమెరా పనితనం అంతకుమించి సినిమాలో వచ్చిన వేగం ఇప్పటి సినిమాలలో గమనించవచ్చు. కే జి ఎఫ్ సినిమా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన “రాక్షసుడు” చిత్రం ఒకేలా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన కే జి ఎఫ్ చిత్ర కథను ఒకసారి గమనిస్తే…

1981 లో కోలారు బంగారు గనులును ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను తయారు చేసుకున్నాడు. 2018లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ సాధారణ యువకుడు ఫీల్డ్స్‌ ఎలా అధినేత అయ్యాడనే క్రమంపై పుస్తకం రాస్తాడు దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. దానిపై పరిశోధన చేసే ఓ ప్రతికాధినేతకు ఆ పుస్తకాన్ని రాసిన జర్నలిస్ట్ కథను వివరించడంతో కథ మొదలవుతుంది.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సూర్యవర్ధన్‌కి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న సూర్య వర్దన్ స్థలం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని పటిష్ఠమైన కాపలాను పెట్టుకుని బంగారం తవ్వే పని ప్రారంభిస్తాడు.

చుట్టు పక్కల గ్రామాల్లోని నివసించే ప్రజలను తీసుకొచ్చి వారిని బానిసలుగా మార్చి పనులు చేయిస్తుంటాడు. అనుకోకుండా సూర్యవర్ధన్‌కి పక్షవాతం వస్తుంది . దాంతో అందరూ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌పై అధిపత్యం సాధించాలని చూస్తుంటారు. అయితే సూర్యవర్ధన్ కొడుకు గరుడ అందరినీ తన కంట్రోల్‌లో ఉంచుకుని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అధిపతిగా ఉంటాడు. అయితే సూర్యవర్ధన్‌కు నమ్మకంగా ఉన్న ఐదు మంది గరుడను చంపి ఆ బంగారు గనులకు నాయకులుగా ఎదగాలని నిర్ణయించుకుంటారు.

ఇకపోతే 36 ఏళ్ల క్రితం ఇలాంటి కథతోనే చిరంజీవి “రాక్షసుడు” అనే చిత్రంలో నటించారు సంక్షిప్తంగా చిత్ర కథను పరిశీలిస్తే.. వితంతు మహిళ మగబిడ్డకు జన్మనివ్వడంతో సినిమా తెరకెక్కింది. భూస్వామి దీనిని ఆమోదించలేదు మరియు శిశువును పారవేసాడు.ఒక తాగుబోతు శిశువును కనుగొని, డబ్బుకు బదులుగా ఆ అబ్బాయిని లేబర్ క్యాంప్‌కు విక్రయించే వరకు కొన్ని సంవత్సరాల పాటు ఉంచాడు. 20 సంవత్సరాల తరువాత, పురుష ( చిరంజీవి ) మరియు అతని స్నేహితుడు సింహం ( నాగేంద్ర బాబు ) లేబర్ క్యాంపు నుండి పురుష తల్లిని ( అన్నపూర్ణ ) చూడటానికి పారిపోతారు.

అయితే పురుష ఇంటి యజమాని దగ్గరకు వెళ్లగా.. చాలా కాలం క్రితం పురుష తల్లి వెళ్లిపోయిందని, వివరాలు రాబట్టాలంటే యజమానికి లంచం ఇవ్వాల్సిందేనని యజమాని చెప్తాడు. పురుష తన ప్రతీకారం తీర్చుకోవడం మరియు అతని తల్లిని ఎలా కలుస్తాడు అనేది మిగిలిన కథ… సినిమా టేకింగ్ లో రాక్షసుడు, కే జి ఎఫ్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఈ రెండు సినిమాలకు ఉన్న తేడా ఏమిటంటే ఫోటోగ్రఫీ. కే జి ఎఫ్ మొత్తం చీకటి ఛాయలతో కూడిన దృశ్యాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి.