Tag Archives: Ramanaidu's younger brother

Daggubhati Abhiram: దగ్గుబాటి ఇంటమోగనున్న పెళ్లి భాజలు… పెళ్లి పీటలు ఎక్కబోతున్న అభిరామ్!

Daggubhati Abhiram:దగ్గుబాటి అభిరామ్ పరిచయం అవసరం లేని పేరు ఈయన సినిమాలోకి రాకముందే తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే హీరోగా అభిరామ్ తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది అయితే తదుపరి సినిమా కోసం అభిరామ్ పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఈయన రెండవ సినిమా ప్రకటనకు ముందే తన పెళ్లి గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అభిరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దగ్గుబాటి అభిరామ్ తన సమీప బంధువు అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ఈవివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. రామానాయుడు తమ్ముడి మనవరాలితో అభిరామ్ వివాహం జరగబోతున్నట్టు సమాచారం. అభిరామ్ కు వరసకు మరదలు కావడంతో కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని నిశ్చయించినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Daggubhati Abhiram: బంధువుల అమ్మాయితో అభిరామ్ వివాహం..


ఈ వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అభిరామ్ త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే అభిరామ్ సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది.