Daggubhati Abhiram:దగ్గుబాటి అభిరామ్ పరిచయం అవసరం లేని పేరు ఈయన సినిమాలోకి రాకముందే తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే హీరోగా అభిరామ్ తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది అయితే తదుపరి సినిమా కోసం అభిరామ్ పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఈయన రెండవ సినిమా ప్రకటనకు ముందే తన పెళ్లి గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అభిరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దగ్గుబాటి అభిరామ్ తన సమీప బంధువు అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే ఈవివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. రామానాయుడు తమ్ముడి మనవరాలితో అభిరామ్ వివాహం జరగబోతున్నట్టు సమాచారం. అభిరామ్ కు వరసకు మరదలు కావడంతో కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని నిశ్చయించినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అభిరామ్ త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే అభిరామ్ సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…