Namrata: నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగులో మహేష్ బాబు సరసన వంశి అనే సినిమాలో నటించారు. 2000వసంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సమయంలోనే నమ్రత మహేష్ ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఇలా ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి ఈ జంట సుమారు ఐదు సంవత్సరాలు పాటు ప్రేమలో విహరిస్తూ అనంతరం 2005వ సంవత్సరంలో వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వివాహం ముందు వరకు నమ్రత సినిమాలలో నటించారు కానీ వివాహం తర్వాత ఈమె సినిమాలకు స్వస్తి పలుకుతూ ఇంటికే పరిమితమయ్యారు. మహేష్ బాబు సినిమాలలో బిజీగా ఉండగా ఈమె మాత్రం ఇంటి బాధ్యతలను చూసుకున్నారు.
ఇలా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. అయితే తాజాగా నమ్రత ఒక జువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమ్రత మాట్లాడుతూ తన కోసం మహేష్ బాబు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ గురించి ఈమె తెలియజేశారు.
మహేష్ బాబు తనకోసం మొదటిసారి వెడ్డింగ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారని ఈ సందర్భంగా నమ్రత మహేష్ ఇచ్చిన మొదటి గిఫ్ట్ గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తనకు నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు తనకు ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతానని తెలియజేశారు. అందుకే తాను షాపింగ్స్ కూడా పెద్దగా చేయనని ఈ సందర్భంగా నమ్రత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…