Nayanatara: నయనతార పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది లేడి సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇంకా వరుస సినిమాలకు కమిట్ అవుతూ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నయనతార సినిమాల విషయంలో కొన్ని కండిషన్ల మీదనే సినిమాలకు కమిట్ అవుతూ ఉంటారు.
ఈమె సినిమాకు కమిట్ అయ్యే సమయంలోనే తాను సినిమా ప్రమోషన్లకు హాజరు కాను అనే కండిషన్ తోనే సినిమాకు కమిట్ అవుతూ ఉంటారు. అందుకే నయనతార నటించిన ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఈమె హాజరు. ఇలాంటి నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం వల్ల దర్శక నిర్మాతలు హీరోలు ఈ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
అయితే సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో నయనతార పెట్టుకున్నటువంటి ఆంక్షలు బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. నయనతార ప్రస్తుతం జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానుంది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటివరకు ఏ సినిమా ప్రమోషన్లకు హాజరుకాని నయనతార జవాన్ సినిమా కోసం హాజరుకావాలని భావించారట.ఇలా జవాన్ విషయంలో తన రూల్స్ నయనతార బ్రేక్ చేస్తున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈమె ఈ సినిమా ప్రమోషన్లకు హాజరవుతున్నారా లేదా తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…