Tag Archives: rangareddy

నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త.. 1500 వరకు ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు..

నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి.. ఈ నెల 9 న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు జాబ్ మేళా ఉంటుందని.. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు 8309877396 నెంబర్‌లో సంప్రదించాలిని అధికారిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ రంగంలోని పేరుగాంచిన జియో మార్ట్‌, స్విగ్గీ, అపోలో ఫార్మసీ, స్చైండర్‌ ఎలక్ట్రిక్‌, జేఎస్‌ఆర్‌ గ్రూప్‌, వేగారియస్‌ సొల్యూషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆక్సిస్‌ బ్యాంక్‌, బిగ్‌ సి, కార్వీ, ఓజాస్‌ ఇన్నోవేటివ్‌, టెక్నాలజీస్‌, విర్టస్‌ ఐటీ ఇండియా వంటి కంపెనీల పొల్గొటాయని పేర్కొన్నారు.

దీనిలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌, మ్యానుప్యాక్చరింగ్‌, మార్కెటింగ్‌, ఐటి, ఐటీఈఎస్‌, ఫార్మా,హెచ్‌పీ తదితర ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా ఉంటుందని వివరించారు. పదో తరగతి, బీటెక్, ఇంటర్, ఎంటెక్, గ్రాడ్యుయేట్‌, పీజీ , డిప్లామా చేసిన వాళ్లు దీనికి అర్హులుగా పేర్కొనాన్నారు.

18 ఏళ్ల నంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. దీనిలో ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం ఉంటుందని.. మొత్తం 1500 కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. హబ్సిగూడలోని ఓమేగా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్‌మేళాలో ఈ నెల 9న అంటే గురువారం రోజున పాల్గొనాలని పేర్కొన్నారు.

తెల్లారితే పెళ్లి.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే?

తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధువులు రావడంతో ఆ ఇంట్లో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. తెల్లవారగానే పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పందిరి వేయడం పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. కేవలం కొన్ని గంటలలో వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన వరుడు ఎవరికి అందని లోకాలకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీగా ఉండగా వరుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌(25)కు కందుకూర్‌ మండలంలోని ఓ అమ్మాయితో ఈనెల 4వ తేదీన వివాహం నిశ్చయమైంది. అతని వివాహం కోసం కొత్త ఇంటిని నిర్మించడంతో కొత్త ఇంటి దగ్గర వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి.

బంధువులందరికీ కొత్త ఇంటి దగ్గరికి చేరుకొని పందిరి వేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఉదయమే పెళ్ళికొడుకుని చేయాల్సి ఉండగా బంధువులు అందరూ వరుడు శ్రీకాంత్ ను వెళ్లి పాత ఇంటిలో నిద్ర పోవలసిందిగా సూచించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పాత ఇంటి దగ్గరికి వెళ్లి పడుకున్నాడు.

శ్రీకాంత్ అన్న రాజు శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి పెళ్లి పందిరి వేయడానికి పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అయితే తన అన్న రాజు తిరిగి వచ్చేలోపు శ్రీకాంత్ ఉరివేసుకుని కనిపించాడు. తెల్లారితే పెళ్లి పెట్టుకొని వరుడు శ్రీకాంత్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఎంతో షాక్ కి గురయ్యారు.ఈ క్రమంలోనే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.