తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధువులు రావడంతో ఆ ఇంట్లో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. తెల్లవారగానే పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లి పందిరి వేయడం పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. కేవలం కొన్ని గంటలలో వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన వరుడు ఎవరికి అందని లోకాలకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీగా ఉండగా వరుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్(25)కు కందుకూర్ మండలంలోని ఓ అమ్మాయితో ఈనెల 4వ తేదీన వివాహం నిశ్చయమైంది. అతని వివాహం కోసం కొత్త ఇంటిని నిర్మించడంతో కొత్త ఇంటి దగ్గర వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి.
బంధువులందరికీ కొత్త ఇంటి దగ్గరికి చేరుకొని పందిరి వేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఉదయమే పెళ్ళికొడుకుని చేయాల్సి ఉండగా బంధువులు అందరూ వరుడు శ్రీకాంత్ ను వెళ్లి పాత ఇంటిలో నిద్ర పోవలసిందిగా సూచించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పాత ఇంటి దగ్గరికి వెళ్లి పడుకున్నాడు.
శ్రీకాంత్ అన్న రాజు శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి పెళ్లి పందిరి వేయడానికి పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అయితే తన అన్న రాజు తిరిగి వచ్చేలోపు శ్రీకాంత్ ఉరివేసుకుని కనిపించాడు. తెల్లారితే పెళ్లి పెట్టుకొని వరుడు శ్రీకాంత్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఎంతో షాక్ కి గురయ్యారు.ఈ క్రమంలోనే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…