నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాలో నటిస్తున్నారు. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ అఖండ సినిమాలో త్వీపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ అఖండ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
గోపీచంద్ మలినేని దర్శకత్వం తర్వాత బాలయ్య కోసం అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరొక దర్శకుడు వెంకీ అట్లూరి సైతం బాలయ్య కోసం ఒక కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రేమ కథలనే తెరకెక్కించిన దర్శకుడు అట్లూరి వెంకీ మొట్టమొదటిసారిగా బాలయ్య బాబుతో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇందుకోసమే ఓ కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కే ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో బోయపాటి సినిమా తర్వాత బాలయ్య ఎవరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచిచూడాలి. అయితే ఈ నెల 10వ తేదీన బాలయ్యబాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని దర్శకుడు తెలియజేయనునట్లు తెలుస్తోంది.
బోయపాటి అఖండ సినిమా విషయానికొస్తే ఇదివరకు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన లెజెండ్, సింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.కరోనా ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…