ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వివిధ వేరియంట్ల రూపంలో కోరలు చాపుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా గత ఏడాది జరగవలసిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అయితే ఒలంపిక్స్ జరుగుతాయా లేదా అన్న సందిగ్ధంలో నిర్వాహకుల నుంచి అథ్లెట్ల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న ఓ కంపెనీ మాత్రం ఒక విచిత్రమైన సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒలంపిక్స్ నిర్వహించకూడదని కొందరు డిమాండ్ చేయగా మరికొన్ని, ఒకవేళ ఒలంపిక్స్ నిర్వహించిన కూడా ప్రేక్షకులను మాత్రం అనుమతించ వద్దని పలు ఎన్జీవోలు జపాన్ ప్రభుత్వం, నిర్వాహక కమిటీని కోరుతున్నాయి. ఈ క్రమంలోనే టోక్యో ఒలంపిక్స్ స్పాన్సర్ లో ఒకరైన ‘అషాహి బ్రూవరీస్’ (Asahi Breweries) సంస్థ మరో డిమాండ్ చేస్తోంది.
టోక్యో ఒలంపిక్స్ పూర్తి ప్రేక్షకులకు అనుమతి నిర్వహించాలి లేకపోతే పూర్తిగా వాయిదా వేయాలని తన అభిప్రాయాన్ని తెలిపింది. జపాన్ లో వివిధ రకాల బీర్ లను,వైన్, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ అమ్మే హక్కులు అన్నీ అషాహీ బ్రూవరీస్ వద్దనే ఉన్నాయి. ఈ క్రమంలోనే
అషాహీ ఒలంపిక్స్ కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి లక్షలాది మంది ప్రేక్షకులు అక్కడికి తరలిరావడంతో వారి బీర్ల అమ్మకాలు పుంజుకుంటాయన్న భావనతోనే ఒలింపిక్స్ కి స్పాన్సర్ చేసినట్లు తెలిపారు.
అషాహీ తమ పేర్లను స్టేడియంలో కూడా అందుబాటులో ఉంచడానికి అనుమతులను దక్కించుకుంది.ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఒలంపిక్స్ నిర్వహిస్తే తమ వ్యాపారం పూర్తిస్థాయిలో దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలంపిక్స్ నిర్వహిస్తే పూర్తిస్థాయి ప్రేక్షకులతో నిర్వహించాలి లేకపోతే ముందుగానే ఒలంపిక్స్ నుంచి స్పాన్సర్ గా తప్పుకుంటామని హెచ్చరిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…