ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ అమలు చేశాయి. మరికొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూలు వారాంతపు సంపూర్ణ లాక్ డౌన్ ను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్న అప్పటికీ పెళ్లిళ్లు, అంత్య క్రియలకు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇదివరకు పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా వరాసియోనీ పట్టణ అధికారులు మాత్రం మరో కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోబోయే వధూవరులకు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉండాలని అధికారులు సూచించారు.
ఈ విధంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నప్పుడే పెళ్లికి అనుమతి లేకపోతే పెళ్లికి అనుమతి లభించదనీ,ప్రతి ఒక్కరిలో వ్యాక్సినేషన్ పై అవగాహన తీసుకురావడం కోసమే అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లి మేము వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేయాలని అనుమతి తెలిపినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా కూడా 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ వేయడం లేదని, ఈ విధంగా వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలోనే వ్యాక్సిన్ వేయించుకునే వరకు పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, శని ఆదివారాలలో సంపూర్ణం లాక్ డౌన్ అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం జూన్ 15వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…