Health News

బాదంతో పిల్లలతో పాటు పెద్దల్లోనూ అది పెరుగుతుంది.. ఏంటంటే?

సాధారణంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి, అధిక ఆందోళన, అధిక ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే నిత్యం బాదం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు పిల్లలకు బాదం పప్పు పెట్టడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

బాదం పప్పు ఒక శక్తివంతమైన అధిక పోషక విలువలు కలిగిన ఆహారం. బాదంపప్పులో ఎక్కువ భాగం విటమిన్స్, మినరల్స్ కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ విధమైనటువంటి పోషకాలు బాదం పప్పులో ఉండటం వల్ల పిల్లల పెరుగుదలకు పూర్తిగా దోహదపడతాయి.

బాదం పప్పులో ఎక్కువ భాగం విటమిన్స్ ఉండటం వల్ల పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పిల్లలకు రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం కనుక నిత్యం వారికి బాదంపప్పు తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు దోహదపడుతుంది.

బాదం పప్పు తినడం ద్వారా కేవలం ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా చర్మ సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.ముఖ్యంగా బాదంపప్పులో క్యాల్షియం అధికశాతం ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వారి శరీరంలోని ఎముకలు దృఢంగా తయారవడానికి బాదం పప్పు ఎంతగానో దోహదపడుతుంది.

ఈ క్రమంలోనే పిల్లలకు ప్రతిరోజు ఎనిమిది నుంచి పది బాదం పప్పులు ఇవ్వడం ద్వారా వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపరచడంతో పాటు పిల్లలు అధిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు బాదం పప్పులు తీసుకోవడం వల్ల శిశువు ఎముకల దృఢత్వం లో, అభివృద్ధిలో ఎంతగానో దోహదపడతాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago