Tag Archives: recovered from the corona people

ప్రజలకు శుభవార్త.. వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదట..?

కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ కు, వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా విషయంలో పరిశోధనలు చేసి ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సంవత్సరాల తరబడి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని అందువల్ల వారికి వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు ఉంటాయని అందువల్ల వీళ్లు రీఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం తక్కువని వెల్లడించారు. అధ్యయనకారులు వీళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 19 నుంచి 81 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కరోనా నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి సమర్థవంతంగా పోరాడే బీ, టీ లింఫోసైట్‌ కణాలు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. బీ, టీ లింఫోసైట్‌ కణాలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మళ్లీ రీ ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు ఆలస్యంగా అంతరిస్తున్నట్టు గుర్తించామని అందువల్ల వీళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ కరోనా వైరస్ ను సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకుంటుందని.. వైరస్ ఎప్పుడు శరీరంలోకి ప్రవేశించినా సమర్థవంతంగా పోరాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనకారులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వల్ల భవిష్యత్తులో కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.