కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ కు, వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా విషయంలో పరిశోధనలు చేసి ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సంవత్సరాల తరబడి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని అందువల్ల వారికి వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు ఉంటాయని అందువల్ల వీళ్లు రీఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం తక్కువని వెల్లడించారు. అధ్యయనకారులు వీళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 19 నుంచి 81 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కరోనా నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి సమర్థవంతంగా పోరాడే బీ, టీ లింఫోసైట్ కణాలు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. బీ, టీ లింఫోసైట్ కణాలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మళ్లీ రీ ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు ఆలస్యంగా అంతరిస్తున్నట్టు గుర్తించామని అందువల్ల వీళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ కరోనా వైరస్ ను సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకుంటుందని.. వైరస్ ఎప్పుడు శరీరంలోకి ప్రవేశించినా సమర్థవంతంగా పోరాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనకారులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వల్ల భవిష్యత్తులో కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…