మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ల సహాయంతో తరచూ బ్యాంక్ లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటాం. అయితే బ్యాంక్ కస్టమర్లు బ్యాంకుల బంద్ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ లావాదేవీలను నిర్వహించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రేపు భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బ్యాంకుల బంద్ కోసం పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మద్దతు ఇవ్వడంతో రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక పాలసీలను అమలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధమైంది. గతంలో ఉన్న పాత చట్టాలలో మార్పులు చేసి కేంద్రం మూడు కొత్త కార్మిక చట్టాలకు ఆమోదం తెలపడంతో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.
10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్రం అమలులోకి తెస్తున్న కొత్త నిబంధనలు కార్మికులకు నష్టం కలిగించే విధంగా కార్పొరేట్లకు మేలు చేకూరే విధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాయి. దాదాపు 75 శాతం మంది కస్టమర్లకు కొత్త చట్టాలు వర్తించవని వెల్లడించాయి. భారతీయ మజ్దూర్ సంఘం తప్ప మిగిలిన అన్ని ట్రేడ్ యూనియన్స్ సమ్మెలో పాల్గొంటూ ఉండటం గమనార్హం.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తప్ప మిగిలిన ఇతర బ్యాంకుల ఉద్యోగులు అంతా ఉన్నారు. దేశంలోని మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది బ్యాం క్ ఉద్యోగులు రేపు సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని కూడా వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…