Tag Archives: Research on 351

పీడకలలు వస్తున్నాయా.. అవి దేనికి సంకేతమో తెలుసా..?

మనలో చాలామందిని నిద్రపోయిన సమయంలో వచ్చే పీడకలలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొందరు ఆ పీడకలలను తలచుకుని భయాందోళనకు గురవుతూ ఉంటారు. నిద్ర లేచిన తరువాత సైతం ఆ పీడకలలు చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. కొందరు వేటి గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారో అవే పీడకలల రూపంలో వస్తూ ఉంటాయి. కొందరికి ఆ పీడకలల వల్ల ప్రశాంతత కూడా ఉండదు.

తమకు వచ్చిన పీడకలలను అవతలి వ్యక్తులను చెబితే ఏమనుకుంటారో చాలామంది అలా చెప్పడానికి సైతం ఇష్టపడరు. ఈ పీడకలల వల్ల కొందరిలో ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. వీళ్లు ఎక్కువగా ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. ఒక సంస్థ 351 మంది పెద్దలపై పీడకలల గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

వీళ్లలో 2 నుంచి 8 శాతంమంది పీడకలలు తమను నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశాయని చెప్పగా మరి కొందరికి ఏదో చెడుశక్తి వెంటాడుతుందన్న భావన కలిగిస్తుందని వెల్లడించారు. పీడకలల వల్ల కొందరు ఆర్‌ఈఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కలలు రావడానికి సరైన కారణాలు తెలియవని.. పీడకలల వల్ల చాలామంది డిప్రెషన్ బారిన పడుతున్నారని తెలిపారు.

పీడకలలు తరచూ వస్తుంటే వైద్యులను సంప్రదించి సకాలంలో వైద్య చికిత్స చేయించుకోవడం మంచిదని తెలుపుతున్నారు. మీకు కూడా తరచూ పీడకలలు వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.