Tag Archives: restaurant

Anchor Suma: చివరికి ఆకులను ఆహారంగా మార్చుకున్న సుమ…అంత కష్టం ఏమొచ్చింది సుమక్క?

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా స్థిరపడ్డారు. అయితే కెరీర్ మొదట్లో ఈమె పలు బుల్లితెర సీరియల్స్ లో నటించారు. అలాగే కొన్ని సినిమాలలో కూడా కీలక పాత్రలలో కనిపించారు.

అయితే ప్రస్తుతం సినిమాలకు బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి సుమ యాంకర్ గా మాత్రం ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు సినిమాకు సంబంధించి ఏ ఈవెంట్ జరగాలన్న అక్కడ సుమ ఉండాల్సిందే అలాగే సినిమా విడుదలవుతుంది అంటే సుమతో ఒక ఇంటర్వ్యూ ఉండాల్సిందే అనేలా దర్శక నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా అభిమానులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన సుమ అక్కడ వివిధ రకాల ఆకులతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేశారు.

Anchor Suma: ఆకులను మనుషులు కూడా తింటారు…


ఈ విధంగా సుమ ఈ డిష్ అందరికి చూపిస్తూ పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఆకులు తింటది మేక మేకను తింటది పులి అనే డైలాగ్ పుష్ప సినిమాలో ఉంది ఆకులను మేక మాత్రమే కాదు మనం కూడా తింటున్నాము అంటూ ఈమె కామెడీ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి అభిమానులు ఇలా ఆకులు తినాల్సిన కష్టం నీకేం వచ్చింది సుమక్క అంటూ కామెంట్ చేస్తున్నారు.

Kiraak RP: అప్పుడే మూతపడిన ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kiraak RP: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు.ఇలా ఈ కార్యక్రమం నుంచి బయటకు రాగానే ఈయన మల్లెమాల వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈ వివాదం తర్వాత ఆర్పీ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమై రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.

ఆర్పీ స్వస్థలం నెల్లూరు కావడంతో నెల్లూరులో ఎంతో ఫేమస్ అయినటువంటి చేపల పులుసు రెస్టారెంట్ ఈయన హైదరాబాద్లో ప్రారంభించారు.నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన ఆర్పీ అన్ని రకాల చేపలు పులుసును కట్టెల పొయ్యిపై తయారుచేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇక ఇక్కడ చేపల పులుసు చాలా టేస్టీగా ఉండటంతో ఎంతో మంది కస్టమర్లు తన హోటల్ ముందు క్యూ కట్టారు. అయితే ఇలా తన రెస్టారెంట్ బిజినెస్ ఎంతో అద్భుతంగా జరుగుతున్న నేపథ్యంలో ఉన్నఫలంగా ఈయన రెస్టారెంట్ మూతపడింది. ఇలా రెస్టారెంట్ మూతపడటానికి ఓ కారణముంది.

Kiraak RP: రెస్టారెంట్లో వర్కర్స్ తక్కువగా ఉండటమే కారణమా..

ఈ రెస్టారెంట్లో దొరికే చేపల పులుసు చాలా రుచికరంగా ఉండడంతో ఎంతోమంది ఇతని రెస్టారెంట్ ముందు క్యూ కడుతున్నారు. అయితే అందరికీ సరిపడా చేపల పులుసు ఆర్పీ అందించలేకపోవడంతో ఈయన రెస్టారెంట్ మూసివేసి చేపల పులుసు చేయడంలో మంచి అనుభవం ఉన్న వారిని హైదరాబాద్ తీసుకు వెళ్లడం కోసం నెల్లూరుకి వచ్చి వేట మొదలుపెట్టారట. ఇలా మనుషులు తక్కువగా ఉండటం వల్ల ఈయన తన రెస్టారెంట్ క్లోజ్ చేశారని త్వరలోనే మరి కొంతమంది మనుషులను నియమించుకొని ఏ ఒక్క కస్టమర్ వెనక్కి వెళ్ళకుండా చూసుకొనే ఆర్పీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.