Tag Archives: revanth

Singer Revanth: ఓ ఇంటివాడైన ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ..! ఫొటోలు వైరల్..!

Singer Revanth: సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటూ… బ్యాచ్ లర్ లైఫ్ కు ముగింపు పలికారు. హీరో నిఖిల్, నితిన్ వంటి వారు గతేడాదే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొంత మంది కూడా ఈ ఏడాది తమ బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దం అవుతున్నారు.

Singer Revanth: ఓ ఇంటివాడైన ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ..! ఫొటోలు వైరల్..!

మరికొంత మంది మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లుగా ఉన్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యంగ్ హీరో అఖిల్ పెళ్లిళ్లపై ఇటీవల సోషల్ మీడియాలో రూమర్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ సింగర్ రేవంత్ ఓ ఇంటివాడయ్యారు.

Singer Revanth: ఓ ఇంటివాడైన ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ..! ఫొటోలు వైరల్..!

తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. గుంటూర్ కు చెందిన అన్వితను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

Singer Revanth: ఓ ఇంటివాడైన ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ..! ఫొటోలు వైరల్..!

ఇండియన్ ఐడల్ 9 గెలిచి.


ఎలాంటి హడావుడి లేకుండా.. నిరాడంబరంగా ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరిగింది. పలువురు సెలబ్రెటీలు ఈ వివాహానికి అటెండ్ అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. డిసెంబర్ 24న అన్విత- రేవంత్ ల నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ… ఇన్ స్టాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.  రేవంత్ తన గాత్రంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియన్ ఐడల్ 9 గెలిచి దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కారుణ్య, శ్రీరామ చంద్ర తరువాత ఇండియన్ ఐడల్ కు వెళ్లి ఎంతో పేరు సంపాదించాడు.

Indian Idol 9 Winner: ఇండియన్ ఐడల్ విజేతకు ఎంగేజ్ మెంట్..ఫొటోలు వైరల్..!

Indian Idol 9 Winner: లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ అలియాస్ రేవంత్. ఇతడు ఒక ప్లేబ్యాక్ సింగర్. తెలుగు భాషలో తన పాటలకు ప్రసిద్ధి చెందాడు. అతడు తెలుగు, కన్నడ చిత్రాలకు దాదాపు 200 పాటలకు పైగా పాడారు. ఇక దేశవ్యాప్తంగా సింగర్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న షో.. ఇండియన్ ఐడల్.

Indian Idol 9 Winner: ఇండియన్ ఐడల్ విజేతకు ఎంగేజ్ మెంట్..ఫొటోలు వైరల్..!

ఈ ఇండియన్ ఐడల్ లో నే బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ 5 విజేతగా నిలిచి బిగ్ బాస్ లోకి వెళ్లాడు. ఇక రేవంత్ కూడా 9వ సీజన్ లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్నాడు. అతడు బాహుబలి: ది బిగినింగ్ చిత్రంలోని ” మనోహరి ” పాట పాడాడు. దీనికి గాను అతడికి IIFA ఉత్సవాల్లో ఉత్తమ నేపథ్య గాయకునిగా స్టార్ మా మ్యూజిక్ అవార్డు ను అందుకున్నాడు.

Indian Idol 9 Winner: ఇండియన్ ఐడల్ విజేతకు ఎంగేజ్ మెంట్..ఫొటోలు వైరల్..!

ఇక 2010లో అతడు సూపర్ సింగర్ 5 మ్యూజిక్ షో తో మొదలైన అతడి ప్రయాణం.. సీటీమార్ చిత్రంలోని సీటీమార్ టైటిల్ సాంగ్ వరకు సాగింది. ఇంకా అతడు ఎన్నో పాటలను తన గాత్రంతో వినిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా.. అతడికి గురించి తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. అతడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇన్ స్టాలో ఫొటోలు వైరల్..

దానికి సంబంధించి ఫొటోలను అతడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు. కాబోయే భార్య పేరు అన్వితగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డిసెంబర్ 24న ఆమెతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. దీంతో ఎంతో మంది సెలెబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.