Singer Revanth: ఓ ఇంటివాడైన ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ..! ఫొటోలు వైరల్..!
Singer Revanth: సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటూ… బ్యాచ్ లర్ లైఫ్ కు ముగింపు పలికారు. హీరో నిఖిల్, నితిన్ వంటి వారు గతేడాదే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొంత మంది కూడా ఈ ఏడాది తమ బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దం అవుతున్నారు.
మరికొంత మంది మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లుగా ఉన్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యంగ్ హీరో అఖిల్ పెళ్లిళ్లపై ఇటీవల సోషల్ మీడియాలో రూమర్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ సింగర్ రేవంత్ ఓ ఇంటివాడయ్యారు.
తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. గుంటూర్ కు చెందిన అన్వితను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.
ఎలాంటి హడావుడి లేకుండా.. నిరాడంబరంగా ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరిగింది. పలువురు సెలబ్రెటీలు ఈ వివాహానికి అటెండ్ అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. డిసెంబర్ 24న అన్విత- రేవంత్ ల నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ… ఇన్ స్టాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తన గాత్రంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియన్ ఐడల్ 9 గెలిచి దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కారుణ్య, శ్రీరామ చంద్ర తరువాత ఇండియన్ ఐడల్ కు వెళ్లి ఎంతో పేరు సంపాదించాడు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…