Categories: FeaturedMovie News

Manchu Vishnu: చిరంజీవి, జగన్ ది పర్సనల్ మీటింగ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మా అధ్యక్షుడు విష్ణు…

Manchu Vishnu: టాలీవుడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాలతో దమ్ము రేపుతోంది. పుష్ప సినిమా విడుదలై భారీ సక్సెస్ సాధించింది. మరో ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఫిలిం లవర్స్ ఎదరుచూస్తున్నారు.

Manchu Vishnu: చిరంజీవి, జగన్ మీటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మా అధ్యక్షుడు విష్ణు… అది పర్సనల్ మీటింగ్ అంటూ కామెంట్స్!

మన సినిమాలు దేశం మొత్తం మారుమోగుతుంటే.. తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏపీలో ధియేటర్ల టికెట్ ధరలను నిర్ణయించింది. దీంతో పాటు ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

Manchu Vishnu: చిరంజీవి, జగన్ మీటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మా అధ్యక్షుడు విష్ణు… అది పర్సనల్ మీటింగ్ అంటూ కామెంట్స్!

ఇదిలా ఉంటే ఈ వివాదంపై గతంలో ఇటు ప్రభుత్వం, అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరో చేసిన థియేటర్ల కలెక్షన్లు, కిరణా దుకాణం కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి.  ఇదిలా ఉంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

మెగాస్టార్ చిరంజీవిల భేటీపై వ్యాఖ్యలు చేయడం..


ఈ సమయంలో ఇండస్ట్రీ సమస్యలను సీఎంకు వివరించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలు తొలిగిపోతాయని.. సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎవరూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని సూచించారు. అక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. అది పర్సనల్ మీటింగ్ అని… దీనితో అసోసియేషన్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిగారు సీఎం జగన్ ని కలవడాన్ని స్వాగతించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago