Manchu Vishnu: టాలీవుడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాలతో దమ్ము రేపుతోంది. పుష్ప సినిమా విడుదలై భారీ సక్సెస్ సాధించింది. మరో ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఫిలిం లవర్స్ ఎదరుచూస్తున్నారు.

మన సినిమాలు దేశం మొత్తం మారుమోగుతుంటే.. తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏపీలో ధియేటర్ల టికెట్ ధరలను నిర్ణయించింది. దీంతో పాటు ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై గతంలో ఇటు ప్రభుత్వం, అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరో చేసిన థియేటర్ల కలెక్షన్లు, కిరణా దుకాణం కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి. ఇదిలా ఉంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
మెగాస్టార్ చిరంజీవిల భేటీపై వ్యాఖ్యలు చేయడం..
ఈ సమయంలో ఇండస్ట్రీ సమస్యలను సీఎంకు వివరించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలు తొలిగిపోతాయని.. సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎవరూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని సూచించారు. అక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. అది పర్సనల్ మీటింగ్ అని… దీనితో అసోసియేషన్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిగారు సీఎం జగన్ ని కలవడాన్ని స్వాగతించారు.


































