Samantha: నేను మాట్లాడే ముందు ఏమి ఆలోచించను..! అలా చేయడం నాకు ఇష్టం లేదు: సమంత
Samantha: సమంత ఈ పేరు తెలియని సగటు ప్రేక్షకుడు.. అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నారు. సమంత వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా వృత్తి పరంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోంది. సినిమాల్లో బిజీగా ఉండటమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ కనిపిస్తోంది.
నిన్న ఆదివారం రోజున ఆమె తన స్నేహితులు నీరజ కోన, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో కలిసి లంచ్ ఔటింగ్‌కు వెళ్లింది. అక్కడ ఒకరినొకకు చిత్రాలు తీసుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసుకున్నారు. అందులో వరలక్ష్మి సమంత ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాసింది..సామ్ ఎంత అందంగా ఉందో అంటూ రాసుకొచ్చింది.
దీనిపై సమంత అభిమానులు కూడా పాజిటివ్ గానే కామెంట్లు చేశారు. ఇక ఇదిలా ఉండగా.. సమంత తన ఇన్ స్టా స్టేటస్ లో రకరకాల పోస్టులు పెడుతోంది. అందులో కొటేషన్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని స్క్రీన్ షాట్స్ తీసి మరీ వైరల్ చేస్తున్నారు. అందులో మరో పోస్టు పెట్టింది సమంత. అందులో “నేను మాట్లాడే ముందు ఆలోచించడం నాకు ఇష్టం లేదు. నా నోటి నుండి వచ్చిన దాని గురించి అందరిలాగే నేను కూడా ఆశ్చర్యపోవాలనుకుంటున్నాను అని తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో రాసుకొచ్చింది.
ప్రస్తుతం దీనిపై సామ్ అభిమానలు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ నెల ప్రారంభంలో సమంత రూత్ ప్రభు ముంబైలో కనిపించింది. మరో బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన నటించేందుకు ఆమె మరో ప్రాజెక్ట్ పై సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బాలీవుడ్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2తో తను అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువగా కెరీర్ పై శ్రద్ధ వహిస్తూ వస్తోంది. ఇటీవల ఆమె పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ కు వేసిన స్టెప్పులు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఊ అంటావా మామా.. అంటూ సాగే పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇలా ఈ పాటతో మరోసారి వెండితెరను శాసించిన సమంత.. కాతు వాకులా రెండు కాదల్, శాకుంతలం , యశోదలో కనిపించనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…