Tag Archives: manchu vishnu

Manchu Vishnu: ఇది చిన్న గొడవే… భూతద్దంలో పెట్టి చూడకండి… గొడవపై క్లారిటీ ఇచ్చిన విష్ణు!

Manchu Vishnu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు బ్రదర్స్ మధ్య జరిగినటువంటి వివాదం హాట్ టాపిక్ గా మారింది.గత కొద్దిరోజులుగా మనోజ్ విష్ణు మధ్య మాటలు లేవని అందుకే మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే మనోజ్ పెళ్లిలో భాగంగా ఎలాంటి మనస్పర్ధలు లేవని తెలిసినప్పటికీ విష్ణు మాత్రం పెళ్లికి ఒక అతిథిలా వచ్చి వెళ్లిపోవడంతో మరికొన్ని అనుమానాలు బలమయ్యాయి.

ఇక మనోజ్ పెళ్లి జరిగి నెల కూడా గడవకముందే విష్ణు ఏకంగా మనోజ్ పై దాడికి ప్రయత్నించారు.ఈ క్రమంలోనే మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి సారధి పై దాడి చేయడమే కాకుండా మనోజ్ పై కూడా విష్ణు దాడికి ప్రయత్నం చేశారు.అయితే ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా తరచూ తన బంధువుల ఇంటికి వచ్చి కొడుతూ ఉంటారని తెలిపారు.

ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈ గొడవపై మంచు విష్ణు స్పందించారు. ఇది నిన్న జరిగిన గొడవ ఇలాంటి గొడవలు మా మధ్య జరగడం సర్వసాధారణం. మనోజ్ చిన్నవాడు ఏదో ఆవేశంలో ఈ వీడియోని షేర్ చేశారు. ఈ గొడవను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

Manchu Vishnu: అన్నదమ్ముల మధ్య సర్వసాధారణం….

ఇది మా మధ్య తరచూ జరిగే చిన్న గొడవ దీనిని భూతద్దంలో పెట్టి చూడకండి అంటూ విష్ణు ఈ గొడవను చాలా తేలికగా తీసుకున్నారు.ఇక మంచు ఫ్యామిలీ సభ్యులు కూడా ఎలాంటి గొడవలు లేవంటూ అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు ప్రతి ఒక్కరి ఇండ్లలోను జరుగుతాయి అంటూ చెప్పుకు రావడం చూస్తుంటే ఈ గొడవలు చాలా తేలికగా తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Manchu Vishnu: సొంత డబ్బుతో నటి పాకీజాకు మా మెంబర్ షిప్ ఇచ్చిన విష్ణు… కరాటే కళ్యాణి పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్!

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వెర్సెస్ మంచు ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇలా వీరిద్దరి అభిమానుల మధ్య లేదా రెండు కుటుంబాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరితో స్థాయిలో విమర్శలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి.

ఇకపోతే తాజాగా మరోసారి నటి కరాటే కళ్యాణి చేసినటువంటి ఒక పోస్ట్ కారణంగా మెగా వర్సెస్ మంచు అని వీరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అసలు వీరిద్దరికీ కరాటే కళ్యాణ్ కి గల సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…గత కొద్ది రోజుల క్రితం కమెడియన్ పాకీజా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉందని తెలియడంతో ఆమెకు మెగా కుటుంబం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఆమె పరిస్థితి తెలుసుకొని తనకు సహాయం చేయడమే కాకుండా మరికొందరు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణు తన డబ్బుతో పాకీజాకు ఉచితంగా మా మెంబర్ షిప్ కార్డ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు.

Manchu Vishnu:

ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ కింద కొందరు మెగా అభిమానులు స్పందిస్తూ పాకీజా గారికి ముందుగా మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు మంచు అభిమానులు కరాటే కళ్యాణికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈమె చేసిన పోస్ట్ కారణంగా మెగా వర్సెస్ మంచు అనేలా ఇద్దరి అభిమానుల మధ్య వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు మెగా అభిమానులు కరాటే కళ్యాణి పై ఫైర్ అవుతున్నారు.

Manchu Vishnu: తమ్ముడి పెళ్లికి గెస్ట్ గా వచ్చిన మంచు విష్ణు… విష్ణుకి ఈ పెళ్లి ఇష్టం లేదా?

Manchu Vishnu: మంచు వారసుడు మనోజ్ భూమ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి ఈ జంట ఒకటయ్యారు. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి మౌనిక మనోజ్ మార్చి మూడవ తేదీ ఫిలింనగర్లోని మంచు లక్ష్మి నివాసంలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలతోపాటు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఇకపోతే మంచు మనోజ్ భూమ మౌనికను వివాహం చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని అలాగే తన సోదరుడు విష్ణుకి కూడా ఏమాత్రం ఇష్టం లేదని అందుకే ఈ పెళ్లిని మంచు లక్ష్మి బాధ్యతగా తీసుకొని తన తమ్ముడి పెళ్లి జరిపిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తెలిసిపోయింది. మంచు మోహన్ బాబు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు.

ఇకపోతే ఈ వివాహ వేడుకలో భాగంగా మంచు విష్ణు కూడా తన భార్య వేరోనిక పిల్లలతో కలిసి సందడి చేశారు. అయితే వీళ్ళు మాత్రం కేవలం తన సొంత తమ్ముడి పెళ్లికి వచ్చిన విధంగా కాకుండా ఏదో పెళ్లికి అతిథుల మాదిరి వచ్చి వెళ్లిపోయారు.ఇలా విష్ణు తన తమ్ముడు మనోజ్ పెళ్లికి ఒక గెస్ట్ లాగా రావడంతో ఈ విషయం కాస్త పలు చర్చలకు దారితీస్తోంది.

Manchu Vishnu: తమ్ముడు పెళ్లిలో అతిథిలా విష్ణు…

ఇక మంచు లక్ష్మి మనోజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే మెహందీ వీడియోని కూడా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.ఇక్కడ ఎక్కడ కూడా విష్ణు ఫ్యామిలీ కనిపించకపోవడం గమనార్హం. ఇలా మంచు మనోజ్ పెళ్లిలో విష్ణు కేవలం గెస్ట్ లాగ వచ్చి వెళ్లడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదా అందుకే అలా వ్యవహరించారా అంటూ అనుమానాలను రేకెత్తిస్తున్నారు.

Manchu Vishnu: బిగ్ బాస్ 7 హోస్ట్ గా మంచు విష్ణు… ఈ వార్తలలో నిజమెంత?

Manchu Vishnu: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ప్రస్తుతానికి మారు సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇకపోతే త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనంతరం తదుపరి సీజన్లన్నింటికీ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టింగ్ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఈయన హోస్ట్ గా నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించరని ఆయన స్థానంలో ఇతర హీరోలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. నాగార్జున స్థానాల్లో బాలకృష్ణ, రామ్ చరణ్, రానా వంటి హీరోల పేర్లు వినిపించాయి.

Manchu Vishnu: మంచు విష్ణుని సంప్రదించిన బిగ్ బాస్ నిర్వాహకులు…

అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో పేరు చేరింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మంచు విష్ణు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు విష్ణువుని సంప్రదించారని సమాచారం. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.

Manchu Vishnu: నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: గత మూడు రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ సినిమా వివాదమే అని చెప్పాలి. మొదటిసారి అర్జున్ సొంత నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తన కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. యంగ్ హీరో విశ్వక్ హీరోగా తన కుమార్తెను హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అర్జున్ ఈ సినిమా పనులన్నింటినీ పూర్తి చేశారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న సమయంలో విశ్వక్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఈ క్రమంలోనే అర్జున్ ప్రెస్ మీట్ లు పెట్టడం అర్జున్ వ్యాఖ్యలకు విశ్వక్ స్పందిస్తూ తన రీజన్స్ తాను వెల్లడించారు.ఇకపోతే ఈ విషయంపై అర్జున్ చాలా సీరియస్ అవ్వడమే కాకుండా తన సినిమా నుంచి తప్పుకోవడం అంటే తన గౌరవాన్ని కించపరిచినట్లనీ భావించినటువంటి ఈయన నటుడు విశ్వక్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం ఈ విషయంపై స్పందిస్తూ నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీలాంటి ఒక సీనియర్ హీరోని ఇబ్బంది పెట్టినటువంటి ఆ యంగ్ హీరోను అసలు వదిలిపెట్టనని మంచు విష్ణు చెప్పినట్టు సమాచారం. అసలు సమస్య ఏంటి ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మంచు విష్ణు తెలుసుకున్నారు.

Manchu Vishnu: విశ్వక్ పై చర్యలకు సిద్ధమైన మా అధ్యక్షుడు…

ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి చెప్పినటువంటి రీజన్స్ సరైనవా లేదా అని తెలుసుకొని ఆయన హీరో విశ్వక్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితులలోనూ అర్జున్ సినిమాని ఆపకుండా ముందుకు తీసుకు వెళ్లడానికి మా అధ్యక్షుడు భరోసా కల్పించారని సమాచారం.ఇలా మంచు విష్ణు నటుడు విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Manchu Vishnu: జిన్నా 100 కోట్లు వసూలు చేయాల్సిన సినిమా.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్?

Manchu Vishnu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో మంచు కుటుంబం ఒకటి.మంచు మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన ఆధారాభిమానాలు సొంతం చేసుకున్నారు. అయితే మంచు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విష్ణు మంచు లక్ష్మి ప్రసన్న ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.

ఇకపోతే మంచు కుటుంబం తరచూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.అయితే ఈ విషయంపై ఎన్నోసార్లు మంచు ఫ్యామిలీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ గురించి ఎవరైతే నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారో వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇలా వారి గురించి నెగటివ్ కామెంట్లు చేసేలా పోస్టులు వాళ్లే పెడుతున్నారనే విషయాన్ని మంచు ఫ్యామిలీ గుర్తించలేకపోతోంది.

ఇలా ఎన్నోసార్లు మీడియా ఎదుట నోరు జారిన మంచు విష్ణు మరోసారి జిన్నా సినిమా విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంచు విష్ణు పై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ సందర్భంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను నటించిన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Manchu Vishnu: అవగాహన లేకుండా విష్ణు మాట్లాడుతున్నారా…

మంచు విష్ణు నటించిన డైనమైట్’ సినిమాకి అయితే నార్త్ లో అత్యధిక టిఆర్పీ లు సాధించిన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ ను దక్కించుకుందని’, అలాంటి సినిమా తెలుగులో వచ్చిన లేదా జిన్నా లాంటి సినిమా హిందీలో రిలీజ్ చేసిన వందల కోట్లు కలెక్షన్లు రాబట్టేవి అంటూ విష్ణు కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి నేటిజన్ లు తీవ్రస్థాయిలో మంచు విష్ణు పై ట్రోల్ చేస్తున్నారు.జిన్నా సినిమా కోటి రూపాయల కలెక్షన్లకు నానా తిప్పలు పడుతున్నారు. అలాంటిది వంద కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు. మరి మా ప్రెసిడెంట్ గారికి ఈ విషయంపై అవగాహన లేదా? అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Mohan Babu: ఆ విషయంలో మోహన్ బాబుకు కండిషన్ పెట్టిన మంచు విష్ణు… వైరల్ అవుతున్న మోహన్ బాబు కామెంట్స్!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్త దూరమైనప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల వేడుకలలో పాల్గొన్నాను అలాగే అబ్దుల్ కలాం గారు మా విద్యాసంస్థలకు వచ్చినప్పుడు కూడా ఆయనతో నేను మాట్లాడాను.అయితే ఇలా ఎంతోమంది పెద్ద వాళ్లతో నేను మాట్లాడినప్పుడు కూడా నాకు ఇంత సమయం వరకే మాట్లాడాలని ఎవరు కండిషన్ పెట్టలేదు.

Mohan Babu: తక్కువ మాట్లాడమని చెప్పారు…

ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఇన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాలి అంటూ నా కొడుకు విష్ణు నాకు కండిషన్ పెట్టారు అంటూ ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశారు. విష్ణు ఇలా చెప్పగానే ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది.అయినా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉంది. కన్న బిడ్డలను కూడా పదిమందిలో పొగడకూడదు అంటారు అంటూ మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Vishnu: ఆది పురుష్ టీజర్ ఎంతో నిరాశపరిచింది.. మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది: మంచు విష్ణు

Manchu Vishnu: బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు నటుడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్.

ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఈ టీజర్ పై ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందిస్తూ విమర్శలు కురిపించారు.రామాయణం అంటే ఒక అద్భుతమైన మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు రావణాసురుడి లుక్ పూర్తిగా మార్చేసారంటూ ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ సినిమా టీజర్ పై తాజాగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు స్పందించారు. ఈయన నటించిన జిన్నా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడినటువంటి మంచు విష్ణు ఈ సినిమా టీజర్ తనని ఎంతో నిరాశపరిచిందని తెలిపారు.రామాయణం సినిమాని లైవ్ సినిమాగా చూపిస్తారనుకుంటే యానిమేషన్ చిత్రంగా చూపిస్తున్నారని,ఈ సినిమా టీజర్ చూస్తుంటే అచ్చం రజినీకాంత్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపారు.

Manchu Vishnu: యానిమేషన్ సినిమా చూపిస్తున్నారు..

ఇక ఈ సినిమా టీజర్ విడుదలకు ముందే ఇది ఒక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే టీజర్ పై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేది కాదని ప్రేక్షకులను మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ విష్ణు ఈ సినిమా టీజర్ పై తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ టీజర్ విషయం పై విమర్శలు ముగిశాయి అనుకునే లోపు మరోసారి విష్ణు టీజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటనల వెనుక ఉన్నది ఇదేనా… ఆ నటుడికి షాక్ ఇచ్చిన విష్ణు?

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన మా అధ్యక్షుడిగా ఎన్నికయి ఏడాది కావడంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు కొన్ని కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ 90% హామీలను పూర్తి చేశానని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వారికి సభ్యత్వం పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు.ఇలా మా అసోసియేషన్ విషయంలో సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు.ఈ విధంగా మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాలు వెనుక చాలా పెద్ద కథ ఉందని తెలుస్తోంది.

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాలు వచ్చే ఎన్నికలలో నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయడానికి వీలు కాకుండా ఉండే నిర్ణయాలను ఈయన తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా మంచు విష్ణుకి లేదా అసోసియేషన్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పడంతో ఇతర సభ్యులు ఎవరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడే పరిస్థితిలో లేదు.

Manchu Vishnu: మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్..

అయితే మరికొందరు మాత్రం ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రకాష్ రాజ్ పూర్తిగా మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికలలో ఈయన పోటీ చేసే ఆలోచనలో లేరని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ ప్రస్తుతం మా అసోసియేషన్ ఎన్నికలపై కాకుండా తెరాస ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ సాధారణ ఎన్నికలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మరి మంచు విష్ణు వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Manchu Vishnu: ఎన్నికల హామీలలో 90 శాతం పూర్తి చేసాం… అలా చేస్తే చర్యలు తప్పవు.. మా ప్రెసిడెంట్ వార్నింగ్?

Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయి సంవత్సరం పూర్తి కావడంతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎంతో అలజడి వాతావరణం నెలకొందని ఈయన గుర్తు చేసుకున్నారు. ఇకపోతే మా ఎన్నికలు ఏకంగా సాధారణ ఎన్నికలను తలపించాయని విష్ణు తెలిపారు.మా అధ్యక్షుడిగా తన కేవలం అసోసియేషన్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా జవాబుదారీ అంటూ తెలిపారు.

ఇకపోతే అసోసియేషన్ లో ఎవరైనా సభ్యత్వం పొందాలి అనుకుంటే కనీసం వారు రెండు సినిమాలలో నటించి ఆ సినిమాలు విడుదలై ఉండాలని అలాగే సినిమాలలో కనీసం ఒక ఐదు నిమిషాలు పాటు అయినా డైలాగులు చెప్పి ఉండాలని తెలిపారు. ప్రస్తుతం అసోసియేషన్ లో 20 మంది నటులు కానీ వారు సభ్యత్వం పొంది ఉన్నారని ఈయన పేర్కొన్నారు.

ఇకపోతే అసోసియేషన్ కి ఎవరైనా వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మా ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలలో 90% ఇప్పటికే పూర్తి చేసామని త్వరలోనే మా బిల్డింగు కూడా పూర్తి అవుతుందని విష్ణు వెల్లడించారు.మా బిల్డింగ్ విషయంలో అసోసియేషన్ సభ్యుల ముందు తాను రెండు ప్రతిపాదనలు ఉంచానని తెలిపారు.

Manchu Vishnu: సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మాణం..

ఒకటి ఫిలింనగర్ కి అరగంట ప్రయాణం దూరంలో బిల్డింగ్ నిర్మించాలని సూచించాము అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ పడగొట్టి అదే స్థానంలో నూతన నిర్మాణం చేపడతామని అందుకు అయ్యే ఖర్చులను మొత్తం తానే భరిస్తాననే ప్రతిపాదనలను అసోసియేషన్ సభ్యుల ముందు ఉంచామని విష్ణు తెలిపారు.అయితే చాలామంది రెండవ ప్రతిపాదనకే ఇష్టత చూపుతున్నారని తెలిపిన ఈయన త్వరలోనే ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలిపారు.