Movie News

Kannappa Movie : కన్నప్ప సినిమాలో ప్రభాస్ తో పాటూ నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి నుంచీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం, ఇందులో నటించిన అతిథి పాత్రలు. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటులు ఈ చిత్రానికి గ్లామర్‌ అడ్డ్ చేశారు. తాజాగా వీరు అందుకున్న రెమ్యునరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి నుంచీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం, ఇందులో నటించిన అతిథి పాత్రలు. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటులు ఈ చిత్రానికి గ్లామర్‌ అడ్డ్ చేశారు. తాజాగా వీరు అందుకున్న రెమ్యునరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Do you know how much Prabhas, Mohanlal, Akshay, and Kajal were paid for the movie Kannappa!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తన తొలి తెలుగు సినిమా చేశాడు. శివుడి పాత్రలో కనిపించిన అక్షయ్, ఈ పాత్ర కోసం రూ. 6 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు సమాచారం. అక్షయ్ ఎప్పుడూ పారితోషికం విషయంలో రాజీ పడడు. ఇదే విషయాన్ని గతంలోనే అతడు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు.

ఇదిలా ఉంటే, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ‘కన్నప్ప’ సినిమాలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటించాడు. శివుడిగా కనిపించే రుద్రుడి పాత్రలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల స్క్రీన్ టైమ్ అందించాడు. ఆయన ఈ సినిమా కోసం ఎన్నో రోజులు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నది సమాచారం. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాకు ఒక్క రోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నా, ఉచితంగా నటించారు.

అలాగే కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి నటులు ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. వీరందరికీ తలో రూ. 1 కోటి చొప్పున రెమ్యునరేషన్ అందించినట్టు సమాచారం. తమిళ నటి ప్రీతి ముకుందన్ కూడా ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఈ మూవీని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రముఖ టీవీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు, విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం వల్ల నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎంతోమంది ప్రముఖులు, అతిథి పాత్రల్లో మెరిసిన నేపథ్యంలో, సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్‌లు పారితోషికం లేకుండా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడం చిత్రసీమలో అరుదైన విషయం అని చెప్పొచ్చు.

telugudesk

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

19 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

27 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

39 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago