General News

న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య.. టీవీ మీడియా వర్గాల్లో విషాద ఛాయలు!

News anchor Swecha commits suicide

హైదరాబాద్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టెలివిజన్ చానల్ టీ-న్యూస్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్చ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్వేచ్చ హైదరాబాద్‌లోని జవహర్ నగర్ ప్రాంతంలో తల్లితో కలిసి నివాసం ఉండేది. అయితే ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

News anchor Swecha commits suicide

స్వేచ్చ తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్ ప్రాంతంలో జీవించేది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యలేనా? పని ఒత్తిడేనా? లేక ఇంకేమైనా కారణాలా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో మీడియా వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చురుకైన యాంకర్‌గా పేరు తెచ్చుకున్న స్వేచ్చ ఈ విధంగా మృతిచెందడం అందరినీ కలిచివేసింది. స్వేచ్చ మరణ వార్త తెలిసిన సహోద్యోగులు, సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago