హైదరాబాద్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ టెలివిజన్ చానల్ టీ-న్యూస్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్చ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్వేచ్చ హైదరాబాద్‌లోని జవహర్ నగర్ ప్రాంతంలో తల్లితో కలిసి నివాసం ఉండేది. అయితే ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

స్వేచ్చ తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్ ప్రాంతంలో జీవించేది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యలేనా? పని ఒత్తిడేనా? లేక ఇంకేమైనా కారణాలా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో మీడియా వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చురుకైన యాంకర్‌గా పేరు తెచ్చుకున్న స్వేచ్చ ఈ విధంగా మృతిచెందడం అందరినీ కలిచివేసింది. స్వేచ్చ మరణ వార్త తెలిసిన సహోద్యోగులు, సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.



























