Movie News

గుండెపోటుతో మృతి చెందిన హీరోయిన్.. విషాదంలో ఇండస్ట్రీ !

Actress Shafali Jariwala dies of sudden heart attack

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి షఫాలీ జరివాలా ఆకస్మిక గుండెపోటుతో మరణించారని సమాచారం. ఆమె వయసు కేవలం 42 సంవత్సరాలే. శుక్రవారం రాత్రి ముంబైలో గల తన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన షఫాలీకి ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో భర్త పరాగ్ త్యాగి ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె గుండెపోటుతో కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు.

Actress Shafali Jariwala dies of sudden heart attack

ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు. గాయని మికా సింగ్ సహా అనేకమంది ప్రముఖులు ఆమె కుటుంబానికి మద్ధతుగా నిలిచారు. చిన్న వయసులోనే ఇలా షఫాలీ చనిపోవడం సినీప్రపంచానికి తీరని లోటుగా అభిప్రాయపడుతున్నారు.

షఫాలీ జరివాలా 2002లో వచ్చిన ‘కాంటా లగా’ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ పాట ఆశా భోస్లే ఆలపించిన క్లాసిక్ నెంబర్‌కి రీమిక్స్ వర్షన్‌గానూ గుర్తింపు పొందింది. పాట విడుదలైన వెంటనే ఆమెకు “కాంటా లగా గర్ల్” అనే బిరుదు కూడా వచ్చినంతగా పేరు తెచ్చింది. తరువాత ‘ముజ్‌సే షాదీ కరోగీ’ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. బిగ్ బాస్ సీజన్ 13లో కూడా పాల్గొని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినా, బాలీవుడ్ యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో కాకపోయినా, కన్నడలో ‘హుడుగారు’ సినిమాలో కూడా నటించారు. కెరీర్ పరంగా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ, వివాహానంతరం కెమెరా దూరంగా ఉండిపోయారు. అప్పుడప్పుడు టెలివిజన్ షోల్లో కనిపిస్తూ వచ్చారు.

ఇలా షఫాలీ జరివాలా ఆకస్మిక మరణం ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆమె చిరునవ్వుతో, అందంతో, ఎనర్జీతో ఎంతో మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ వర్గాలు ప్రార్థిస్తున్నాయి.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

5 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

6 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

13 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

14 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

14 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago