Manchu Vishnu: మంచు వారసుడు మనోజ్ భూమ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి ఈ జంట ఒకటయ్యారు. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి మౌనిక మనోజ్ మార్చి మూడవ తేదీ ఫిలింనగర్లోని మంచు లక్ష్మి నివాసంలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలతోపాటు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఇకపోతే మంచు మనోజ్ భూమ మౌనికను వివాహం చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని అలాగే తన సోదరుడు విష్ణుకి కూడా ఏమాత్రం ఇష్టం లేదని అందుకే ఈ పెళ్లిని మంచు లక్ష్మి బాధ్యతగా తీసుకొని తన తమ్ముడి పెళ్లి జరిపిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తెలిసిపోయింది. మంచు మోహన్ బాబు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు.
ఇకపోతే ఈ వివాహ వేడుకలో భాగంగా మంచు విష్ణు కూడా తన భార్య వేరోనిక పిల్లలతో కలిసి సందడి చేశారు. అయితే వీళ్ళు మాత్రం కేవలం తన సొంత తమ్ముడి పెళ్లికి వచ్చిన విధంగా కాకుండా ఏదో పెళ్లికి అతిథుల మాదిరి వచ్చి వెళ్లిపోయారు.ఇలా విష్ణు తన తమ్ముడు మనోజ్ పెళ్లికి ఒక గెస్ట్ లాగా రావడంతో ఈ విషయం కాస్త పలు చర్చలకు దారితీస్తోంది.
ఇక మంచు లక్ష్మి మనోజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే మెహందీ వీడియోని కూడా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.ఇక్కడ ఎక్కడ కూడా విష్ణు ఫ్యామిలీ కనిపించకపోవడం గమనార్హం. ఇలా మంచు మనోజ్ పెళ్లిలో విష్ణు కేవలం గెస్ట్ లాగ వచ్చి వెళ్లడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదా అందుకే అలా వ్యవహరించారా అంటూ అనుమానాలను రేకెత్తిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…