Tag Archives: Manoj

Manchu Manoj: నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మనోజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మనోజ్ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

త్వరలోనే ఆంధ్రలో ఎన్నికలు జరగబోతున్నాయని అయితే మీరు ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఓటు వేయాలని ఎలా చెప్పారు ఎవరైతే మనతో పాటు మనకు తోడుగా నడుస్తారు. వారికే ఓటు వేయాలని తెలిపారు. దారుణాలకు పాల్పడేవారికి సొంత సభ్యులకే న్యాయం చేయలేకపోయే వారికి మాత్రం ఓటు వేయకండి అంటూ ఈయన చెప్పుకువచ్చారు.

మనోజ్ ఇలా ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఓటు వేయద్దు అంటూ ప్రచారం చేశారు అంటూ పలువురు పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ చేశారు ఇలా తన గురించి ట్రోల్స్ వస్తున్నటువంటి తరుణంలో మనోజ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నాన్న పుట్టినరోజు వేడుకలలో భాగంగా నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి అందుకే క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను అని తెలిపారు.

ఏ పార్టీతో నాకు సంబంధం లేదు..
ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటల ఉద్దేశం. ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. గొడవలు కూడా లేవు. నటుడిగా నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఈయన ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Manoj -Mounika: ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని రక్షించుకుంటా.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్టు!

Manoj -Mounika: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈయన గతేడాది భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మార్చి మూడవ తేదీ వీరి వివాహం మంచు లక్ష్మి నివాసంలో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా భూమా మౌనికతో పెళ్లి తర్వాత మనోజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే ఇటీవల వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మనోజ్ తన భార్య మౌనికకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నీతో ఉన్న ప్రతిక్షణం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నిన్ను ధైరవ్ ను నా జీవితంలోకి పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను త్వరలోనే మన బిడ్డ కూడా రాబోతున్నారు. నీ రాకతో నా జీవితం ఎంతో అద్భుతంగా సాగిపోతుందని తెలిపారు.

ఆ లోటు భర్తీ చేయలేను..
ఇక నిన్ను మీ అమ్మానాన్నల మాదిరిగా చూసుకోలేకపోవచ్చు కానీ ప్రతిక్షణం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను మీ జీవితంలో ఏ విధమైనటువంటి కష్టం రాకుండా నా ప్రాణాలను అడ్డేసి మిమ్మల్ని కాపాడుతాను. నీకు నా హృదయంలో ఎంతో గొప్ప స్థానం ఉంది మనం ఇలాంటి పెళ్లి రోజులను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నా సతీమణికిపెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ మనోజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C4Dc8_YSBJH/?utm_source=ig_embed&ig_rid=f2a46162-b7b3-4fb0-94bf-09e6a5a6f7e3

Manoj -Mounika: ప్రేమికుల రోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ భార్యతో ఏకాంతంగా గడిపిన మనోజ్.. ఫోటో వైరల్!

Manoj -Mounika: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు వాలెంటైన్స్ డే సందర్భంగా వారి లైఫ్ పార్టనర్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలోనే నటుడు మంచు మనోజ్ సైతం తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

మొదటి భార్యతో విడాకులు తీసుకున్నటువంటి మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని ప్రేమించారు. ఈమె కూడా అప్పటికే విడాకులు తీసుకొని ఉన్నారు ఇలా వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉంటూ గత ఏడాది మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరికి మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఈ రోజును చాలా ఘనంగా జరుపుకున్నారని తెలుస్తుంది

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్ ఎక్కడికి వెళ్లినా తన భార్యను వెంట తీసుకొని వెళ్తున్నారు. ఇలా వీరిద్దరూ ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం కావడంతో వీరిద్దరు విదేశాలకు వెళ్లారని తెలుస్తుంది. ఇలా విదేశాలలో తమ వాలెంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. బీచ్ వడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఏకాంతంగా వీరిద్దరూ ఈరోజు జరుపుకున్నారు.

బీచ్ ఒడ్డున వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్…

ఇక మంచు మనోజ్ షేర్ చేసినటువంటి ఈ ఫోటోలో వీరిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఒకరి కళ్ళల్లో ఒకరు ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manoj -Mounika: మనోజ్ మౌనిక దంపతులకు పుట్టబోయేది ఆ బిడ్డనేనా… అలా హింట్ ఇచ్చిన హీరో?

Manoj -Mounika: మంచు మనోజ్ మౌనిక కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఈ ఏడాది మొదట్లో పెద్దల సమక్షంలో వీరిద్దరు తిరిగి రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మౌనిక మనోజ్ ఇదివరకు వేరే వ్యక్తులను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి మనోజ్ మౌనిక ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు..

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు అయితే ఇదివరకే మౌనికకు ఒక కుమారుడు కూడా ఉండగా ఆ కుమారుడి బాధ్యతలను కూడా మనోజ్ తీసుకున్నారు. రెండో పెళ్లి తర్వాత మనోజ్ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ఇకపోతే ఇటీవల ఈయన తండ్రి కాబోతున్నాను అంటూ ఒక శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇదే విషయాన్ని ఈయన తన అత్తమ్మ శోభనాగిరెడ్డి జయంతి సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు తన తల్లిదండ్రులు మోహన్ బాబు నిర్మల దేవి ఆశీస్సులతోనూ అలాగే తన అత్తమ్మ శోభనాగిరెడ్డి, నాగిరెడ్డి గార్ల ఆశీస్సులతో మేము తల్లిదండ్రులు కాబోతున్నామని మా కుటుంబం పెద్దది కాబోతుందని వారి ఆశీర్వాదాలు మాపై ఉండాలని ఈయన తెలియజేశారు.

కూతురు పుట్టబోతోందా…

ఇలా మౌనిక ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడంతో ఎంతోమంది ఈ వార్తలపై స్పందిస్తూ మనోజ్ కి పుట్టబోయేది అమ్మాయేనని, ఆయన ఈ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ అందరికీ హింట్ ఇచ్చారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మనోజ్ ఈ శుభవార్తను ఎప్పుడైనా అభిమానులతో పంచుకోవచ్చు కానీ శోభనాగిరెడ్డి జయంతి సందర్భంగా మాత్రమే చెప్పారు అంటే తిరిగి శోభనాగిరెడ్డి వారికి కూతురుగా పుట్టబోతుందని అందుకే ఈయన అదే రోజే ఈ విషయాన్ని తెలియజేశారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Manchu Manoj: బాబు గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసమే వచ్చాము…. చంద్రబాబు భేటీ అనంతరం మనోజ్ కామెంట్స్!

Manchu Manoj: మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు ఇలా మౌనిక మనోజ్ చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారన్న విషయం తెలియడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు కారణమైంది. అసలు మనోజ్ చంద్రబాబు నాయుడుని కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు.

ఇలా సోమవారం సాయంత్రం భూమా మౌనికతో పాటు మనోజ్ వీరి కుమారుడు కూడా చంద్రబాబు నాయుడుని కలిసారు. అనంతరం మనోజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో భేటీ కావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ… పెళ్లి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకున్నాము కానీ కుదర లేకపోయిందని తెలిపారు.

ఈ క్రమంలోనే అంకుల్ హైదరాబాద్ లో ఉన్నారని తెలియగానే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చామని మనోజ్ తెలిపారు. ఇక రేపు మా బాబు పుట్టినరోజు అందుకే అంకుల్ బ్లెస్సింగ్స్ కోసం వచ్చామని ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.


Manchu Manoj: క్యాజువల్ గానే కలిసాము…

మీరు రాజకీయాలలోకి రాబోతున్నారా అంటూ మనోజ్ ను ప్రశ్నించగా ఆ విషయం ఒక మంచి తరుణంలో మౌనిక తెలియచేస్తారని మనోజ్ తెలిపారు దీన్ని బట్టి చూస్తుంటే బహుశా మౌనిక రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన అనంతరం కొన్ని క్యాజువల్ విషయాల గురించి తాము మాట్లాడుకున్నామంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Manoj -Mounika: అనాథ చిన్నారులతో కలసి ఆది పురుష్ సినిమా చూసిన మనోజ్ మౌనిక!

Manchu Manoj -Mounika: ప్రభాస్ నటించిన ఆది
పురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు ముందే పలువురు హీరోలు పెద్ద ఎత్తున టికెట్లను కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే భూమా మౌనిక మనోజ్ దంపతులు కూడా అనాధ పిల్లల కోసం ఏకంగా 2500 టికెట్లను కొనుగోలు చేశారు.రామాయణం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ముఖ్యంగా చిన్నపిల్లలు రామాయణం గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే ఇలా అనాధల కోసం టికెట్లు కొనుగోలు చేసినట్టు ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ విధంగా అనాధ పిల్లల కోసం టికెట్లను కొనుగోలు చేయడమే కాకుండా మొదటి రోజు సినిమా విడుదలైన తరువాత అనాధ పిల్లలతో కలిసి భూమా మౌనిక మనోజ్ దంపతులు ఈ సినిమాని చూశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిజంగానే మనోజ్ మౌనిక దంపతులు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Manchu Manoj -Mounika:నిజంగా గ్రేట్ అంటూ…


ఇక మనోజ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ఈయన తన పుట్టినరోజు వేడుకలను కూడా అనాధాశ్రమంలోనే జరుపుకున్నారు. అక్కడ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారికి బుక్స్, బ్యాగ్ వంటి అవసరమైన వస్తువులను పంపిణీ చేసి మంచి మనసు చాటుకున్నారు.

Manchu Manoj -Mounika: అనాధల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మనోజ్ మౌనిక దంపతులు.. గ్రేట్ అంటూ?

Manchu Manoj -Mounika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాల పరంగాను తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.మనోజ్ భూమ మౌనిక వివాహం చేసుకున్న తర్వాత తన జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తిరిగి సినిమా పనులలో కూడా ఈయన బిజీ అయ్యారు.ఇకపోతే మౌనిక మనోజ్ దంపతులు అనాధ పిల్లల కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు హీరోలు పేదవారి కోసం అనాధ పిల్లల కోసం పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక దంపతులు కూడా 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇక ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎలాంటి హద్దులు లేకుండా అందరూ ఒక వేడుకల జరుపుకోవాల్సిన సినిమా ఆది పురుష్. దీనిని మా జీవితంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నామంటూ తెలియజేశారు.

Manchu Manoj -Mounika: జైశ్రీరామ్ అన్న శ్లోకం వినిపించాలి…


ఈ క్రమంలోని ఇలాంటి ఒక గొప్ప సినిమాని రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఆశ్రమాలలో ఉన్న అనాధ పిల్లలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాం జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్నిచోట్ల వినిపించాలి అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక దంపతులు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi: మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదా… ఆసక్తికర సమాధానం చెప్పిన లక్ష్మి మంచు!

Manchu Lakshmi: సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలో మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే మంచు ఫ్యామిలీలోని ఈ ముగ్గురు పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేదని చెప్పాలి.

ఇకపోతే కెరియర్ పరంగా ఎలా ఉన్నా వీరు వ్యక్తిగత కారణాల వల్ల మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం మనోజ్ విష్ణు ఏకంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు చుట్టం చూపుగా వచ్చారు. అయితే ఆల్రెడీ పెళ్లి జరిగి ఒక కుమారుడు ఉన్నటువంటి అమ్మాయి భూమ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణువుకి ఇష్టం లేకపోవడంతోనే తన తమ్ముడు పెళ్లికి చుట్టం చూపుగా వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి అభిమానులతో ముచ్చటించారు.

Manchu Lakshmi: విష్ణుకి ఇష్టం లేదా…


ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదు కదా అంటూ ప్రశ్నించారు.మంచు లక్ష్మి అవునని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు విష్ణుకి ఇష్టం లేదంటే వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ కూడా నిజమేనని పలువురు ఈ గొడవ గురించి చర్చలు జరుపుతున్నారు.

Manchu Manoj: మౌనిక వల్లే నాకు మంచి లైఫ్ దొరికింది.. మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్..?

Manchu Manoj: మంచు మనోజ్ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భార్య నుండి దూరమైన తర్వాత చాలాకాలం ఒంటరిగా ఉన్న మనోజ్ కి ఆ తర్వాత తన స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డి తో ప్రేమ బంధం ఏర్పడింది.

భూమా మౌనిక కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి బాబుతో ఒంటరిగా జీవిస్తున్న సమయంలో మనోజ్ ఆమెను ప్రేమించి పెద్దల అంగీకారంతో ఇటీవల ఘనంగా వివాహం చేసుకున్నారు.వివాహం తరువాత భూమా మౌనికతో మనోజ్ మొదటిసారిగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ షో లో మౌనిక రెడ్డి గురించి మాట్లాడుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ షో లో మంచు మనోజ్ మాట్లాడుతూ..

” మా ఇరు కుటుంబాలకు దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉంది. కానీ అనుకోకుండా మా ఇద్దరి లైఫ్‌లో చెరోదారిలో వెళ్లాం.కానీ వివాహాం తరువాత నా కెరీర్‌లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో మౌనికతో కలిసి మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని మొదట నాకే అనిపించింది. మేము మంచి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే తన వల్లే నాకు లైఫ్ దొరికింది అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.

Manchu Manoj: హ్యాపీగా బ్రతకాలని ఉంది…

అంతే కాకుండా..’ ఒక రోజు తనతో నువ్వంటే ఇష్టమని చెప్పాను. నాకు మళ్లీ హ్యాపీగా బతకాలనుంది. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నాకు మంచి లైఫ్ దొరుకుతుంది. నిన్ను, బాబును బాగా చూసుకుంటా అని చెప్పా. కానీ మౌనిక మాత్రం సమాజం గురించి, కుటుంబం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాక అని అడిగింది. కానీ సమాజం గురించి నేను పట్టించుకోను, ఇక కుటుంబ సభ్యులు నేను చెబితే వింటారు అని మాట ఇవ్వటంతో ఆమె నా ప్రేమను అంగీకరించింది అని మనోజ్ తెలిపాడు. ఇలా మౌనిక వల్లే తన జీవితం మారిపోయిందని మనోజ్ వెల్లడించారు.

Bhuma Mounika: మొదటిసారిగా భర్తతో దిగిన ఫోటోనే పంచుకున్న భూమా మౌనిక.. వైరల్ అవుతున్న ఫోటో..!

Bhuma Mounika: భూమా నాగిరెడ్డి , శోభ నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డి ఇటీవల హీరో మంచు మనోజ్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది . గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్న వీరిద్దరూ నెల రోజుల క్రితం కుటుంబ సభ్యుల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని కొత్త ప్రయాణం ప్రారంభించారు. వివాహం తర్వాత మౌనిక రెడ్డి మనోజ్ దంపతులు తిరుపతి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇలా వీరి వివాహం తర్వాత నుండి మంచు కుటుంబం ఏదో ఒక వివాదం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ మనోజ్ మౌనిక ఇద్దరు కలిసి జంటగా మీడియా ముందుకి రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా వివాహం తర్వాత మనోజ్, మౌనిక ఇద్దరూ కలిసి ఒక టీవీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో దిగిన ఫోటోని మౌనిక రెడ్డి మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న ఈ జంట జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మౌనిక మనోజ్ మధ్య 12 ఏళ్ల పరిచయం ఉంది. వీరిద్దరూ కూడా తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని ఒకరినొకరు ఇష్టపడి ఇటీవల కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే వీరి వివాహానికి మొదట కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వారి అంగీకారం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Bhuma Mounika: క్యూట్ ఫోటో షేర్ చేసిన మౌనిక…


మౌనిక రెడ్డి కుమారుడి బాధ్యతను కూడా మంచు మనోజ్ స్వీకరించాడు. దీంతో అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మౌనిక రెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉండే మౌనిక ఇప్పటివరకు పెళ్లి ఫోటోలను ఎక్కడ అభిమానులతో పంచుకోలేదు. అయితే ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి మౌనిక తన భర్త మనోజ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అవుతుంది.