Manchu Manoj: మంచు మనోజ్ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భార్య నుండి దూరమైన తర్వాత చాలాకాలం ఒంటరిగా ఉన్న మనోజ్ కి ఆ తర్వాత తన స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డి తో ప్రేమ బంధం ఏర్పడింది.
భూమా మౌనిక కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి బాబుతో ఒంటరిగా జీవిస్తున్న సమయంలో మనోజ్ ఆమెను ప్రేమించి పెద్దల అంగీకారంతో ఇటీవల ఘనంగా వివాహం చేసుకున్నారు.వివాహం తరువాత భూమా మౌనికతో మనోజ్ మొదటిసారిగా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ షో లో మౌనిక రెడ్డి గురించి మాట్లాడుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ షో లో మంచు మనోజ్ మాట్లాడుతూ..
” మా ఇరు కుటుంబాలకు దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉంది. కానీ అనుకోకుండా మా ఇద్దరి లైఫ్‌లో చెరోదారిలో వెళ్లాం.కానీ వివాహాం తరువాత నా కెరీర్‌లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో మౌనికతో కలిసి మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని మొదట నాకే అనిపించింది. మేము మంచి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే తన వల్లే నాకు లైఫ్ దొరికింది అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.
అంతే కాకుండా..’ ఒక రోజు తనతో నువ్వంటే ఇష్టమని చెప్పాను. నాకు మళ్లీ హ్యాపీగా బతకాలనుంది. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నాకు మంచి లైఫ్ దొరుకుతుంది. నిన్ను, బాబును బాగా చూసుకుంటా అని చెప్పా. కానీ మౌనిక మాత్రం సమాజం గురించి, కుటుంబం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాక అని అడిగింది. కానీ సమాజం గురించి నేను పట్టించుకోను, ఇక కుటుంబ సభ్యులు నేను చెబితే వింటారు అని మాట ఇవ్వటంతో ఆమె నా ప్రేమను అంగీకరించింది అని మనోజ్ తెలిపాడు. ఇలా మౌనిక వల్లే తన జీవితం మారిపోయిందని మనోజ్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…