Bhuma Mounika: భూమా నాగిరెడ్డి , శోభ నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డి ఇటీవల హీరో మంచు మనోజ్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది . గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్న వీరిద్దరూ నెల రోజుల క్రితం కుటుంబ సభ్యుల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని కొత్త ప్రయాణం ప్రారంభించారు. వివాహం తర్వాత మౌనిక రెడ్డి మనోజ్ దంపతులు తిరుపతి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇలా వీరి వివాహం తర్వాత నుండి మంచు కుటుంబం ఏదో ఒక వివాదం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ మనోజ్ మౌనిక ఇద్దరు కలిసి జంటగా మీడియా ముందుకి రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా వివాహం తర్వాత మనోజ్, మౌనిక ఇద్దరూ కలిసి ఒక టీవీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో దిగిన ఫోటోని మౌనిక రెడ్డి మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న ఈ జంట జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మౌనిక మనోజ్ మధ్య 12 ఏళ్ల పరిచయం ఉంది. వీరిద్దరూ కూడా తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని ఒకరినొకరు ఇష్టపడి ఇటీవల కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే వీరి వివాహానికి మొదట కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వారి అంగీకారం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
మౌనిక రెడ్డి కుమారుడి బాధ్యతను కూడా మంచు మనోజ్ స్వీకరించాడు. దీంతో అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మౌనిక రెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉండే మౌనిక ఇప్పటివరకు పెళ్లి ఫోటోలను ఎక్కడ అభిమానులతో పంచుకోలేదు. అయితే ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి మౌనిక తన భర్త మనోజ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…