Featured

Serial Artist Sripriya : కొడుకులు లేరని బాధపడ్డా… నా గురువు, నా ఫ్రెండ్ అన్నీ భర్తే… ఎమోషనల్ అయిన సీరియల్ నటి శ్రీప్రియ…!

Serial Artist Sripriya : సంధ్యా రాగం సీరియల్ తో అనుకోకుండా బుల్లితెర మీద అడుగుపెట్టిన నటి శ్రీప్రియ. అయితే ఈ పేరుతో ఈమెను గుర్తు పట్టడం కష్టం. కానీ ‘మొగలిరేకులు’ సీరియల్ లో రజనీ అనగానే అందరికీ టక్కున గుర్తొస్తుంది. అందులో హీరోయిన్ దేవి తల్లిగా నటించిన శ్రీప్రియ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘వైదేహి పరిణయం’ సీరియల్ లో దేవాన్ష్ తల్లిగా నటిస్తున్న ఆమె తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా గురువు, ఫ్రెండ్ అన్నీ భర్తే…

శ్రీప్రియ గారు అసలు ఇండస్ట్రీ వైపు రావాలని అనుకోలేదు, ఏనాడూ ఆలోచించలేదట. అయితే ఆమె భర్త డైరెక్టర్ శ్రీకర్ గార సొంత నిర్మాణంలో మరికొందరి భాగస్వామ్యంలో సీరియల్ చేయాలని అనుకుంటే షూటింగ్ మొదలయ్యే సమయానికి హీరోయిన్ అందుబాటులో లేకపోయే సరికి చెల్లి సలహాతో తన భార్య శ్రీప్రియను హీరోయిన్ గా పెట్టి సంధ్యా రాగం సీరియల్ చేశారట. అలా బుల్లితెర మీద అడుగుపెట్టిన శ్రీప్రియ గారికి ఇక ఆ సీరియల్ చాలు అనుకున్న సమయంలో మంజుల నాయుడు గారి నుండి ఫోన్ వచ్చి మొగలిరేకులు ఆఫర్ రావడంతో ఆడిషన్ వెళితే మూడు నెలలు దాటక షూటింగ్ కి పిలుపు వచ్చిందట.

అలా రజనీ పాత్రలో మెప్పించిన శ్రీప్రియ గారికి కెమెరా ముందు ఎలా నిల్చొవాలి, ఎలా మేకప్ సెట్ చేయాలి లైటింగ్ ఎలా చూసుకోవాలి వంటి విషయాలను ఆమె భర్త శ్రీకర్ గారే నేర్పించారట. అందుకే ఆమె భర్తే తనకు గురువు, ఫ్రెండ్ అన్నీ అంటూ చెప్తారు. ఇక కొడుకులు లేరనే భాధ ఉండేదని అయితే చలా సీరియల్స్ లో ఎక్కువగా హీరోలకు తల్లి పాత్ర చేయడం వల్ల ఆ లోటు కూడా తీరిపోయిందని చెప్పారు శ్రీప్రియ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago