Manoj -Mounika: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈయన గతేడాది భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మార్చి మూడవ తేదీ వీరి వివాహం మంచు లక్ష్మి నివాసంలో ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా భూమా మౌనికతో పెళ్లి తర్వాత మనోజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే ఇటీవల వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మనోజ్ తన భార్య మౌనికకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నీతో ఉన్న ప్రతిక్షణం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నిన్ను ధైరవ్ ను నా జీవితంలోకి పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను త్వరలోనే మన బిడ్డ కూడా రాబోతున్నారు. నీ రాకతో నా జీవితం ఎంతో అద్భుతంగా సాగిపోతుందని తెలిపారు.
ఆ లోటు భర్తీ చేయలేను..
ఇక నిన్ను మీ అమ్మానాన్నల మాదిరిగా చూసుకోలేకపోవచ్చు కానీ ప్రతిక్షణం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను మీ జీవితంలో ఏ విధమైనటువంటి కష్టం రాకుండా నా ప్రాణాలను అడ్డేసి మిమ్మల్ని కాపాడుతాను. నీకు నా హృదయంలో ఎంతో గొప్ప స్థానం ఉంది మనం ఇలాంటి పెళ్లి రోజులను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నా సతీమణికిపెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ మనోజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…