Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి మాస్ యాక్షన్ సినిమాలను చేశారు అంతేకాకుండా ప్రభాస్ ఎన్నో ప్రేమ కథ సినిమాలలో కూడా నటించారు. ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మచ్చ సక్సెస్ కావడంతో ఈయన వరుసగా పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఈయన బాహుబలి సినిమా చేయకముందు డార్లింగ్ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.
ఇలా ఒక్కసారిగా ప్రభాస్ సినీ కెరియర్ టర్న్ అవ్వటానికి రానా కారణమని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ కరుణాకర్ డార్లింగ్ సినిమా కథతో రానా వద్దకు వెళ్లారట ఈ సినిమా కథ మొత్తం విన్నటువంటి రానా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అయితే ఆయన సినిమా రిజెక్ట్ చేయడానికి కారణం చెప్పలేదు కానీ ఈ సినిమాలో నటించడానికి ఇష్టం చూపలేదు.
డార్లింగ్ రానా చేయాల్సి ఉండేదా..
ఈ విధంగా రానా ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో కరుణాకర్ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులను చేసుకొని ప్రభాస్ వద్దకు వెళ్లారట. ఇలా ఈ కథ విన్నటువంటి ప్రభాస్ ఈ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా రానా రిజెక్ట్ చేయడంతోనే డార్లింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ప్రభాస్ చేశారు. ఈ సినిమాతో ఈయన సినీ కెరియర్ లో సక్సెస్ అయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించారు ఈ సినిమా ఇద్దరిని పాన్ ఇండియా హీరోలుగా మార్చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…