Manchu Manoj -Mounika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాల పరంగాను తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.మనోజ్ భూమ మౌనిక వివాహం చేసుకున్న తర్వాత తన జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తిరిగి సినిమా పనులలో కూడా ఈయన బిజీ అయ్యారు.ఇకపోతే మౌనిక మనోజ్ దంపతులు అనాధ పిల్లల కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు హీరోలు పేదవారి కోసం అనాధ పిల్లల కోసం పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక దంపతులు కూడా 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇక ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎలాంటి హద్దులు లేకుండా అందరూ ఒక వేడుకల జరుపుకోవాల్సిన సినిమా ఆది పురుష్. దీనిని మా జీవితంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నామంటూ తెలియజేశారు.
ఈ క్రమంలోని ఇలాంటి ఒక గొప్ప సినిమాని రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఆశ్రమాలలో ఉన్న అనాధ పిల్లలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాం జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్నిచోట్ల వినిపించాలి అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక దంపతులు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…