Featured

Srireddy : నేను చీర కట్టుకున్నా నగ్నంగా నిలబడినట్లే…: శ్రీరెడ్డి

Srireddy : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమాల్లో కనిపించకపోయినా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. గత కొన్నిరోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడా తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ ఉండటంతో చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది. ఇక ఈ మధ్యనే మళ్ళీ తెలుగు సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో ఎక్కువగా కనిపిస్తున్న శ్రీరెడ్డి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నేను నగ్నంగా ఉన్నట్లే…

శ్రీరెడ్డి సోషల్ మీడియాను ఉపయోగించుకుని చీప్ పబ్లిసిటీ చేస్తోంది అనే వాదన ఉంది అంటూ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు శ్రీ రెడ్డి తన స్టైల్ లో సమాధానం చెప్పింది. తాను తన కెరీర్ మొదట్లో సాక్షి ఛానెల్ లో జర్నలిస్ట్ గా పనిచేసానని, అక్కడే నిజం నిర్భయంగా మాట్లాడటం నేర్చుకున్నానని, నా పోరాటం నాకు అవకాశాలు రావడం కోసమా కాదు నాకు జరిగిన అవమానాలు వంటివి ఓపెన్ గా చెప్పడం వల్ల ఇండస్ట్రీలో కొంచమైనా పరిస్థితులు మారుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.

తను న్యూస్ రీడర్ గా ఉన్న సమయంలోనే ఎంతో మంది అభిమానులు ఉన్నారని అందుకే సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోయర్స్ తనకు ఉన్నట్లు తెలిపారు. చీప్ పబ్లిసిటీ చేయాల్సిన పనిలేదని అందుకోసం నాకు జరిగిన సంఘటనలను చెప్పాల్సిన పనిలేదు, దానివల్ల నేను ఇప్పుడు చీర కట్టుకుని కూర్చున్నా నగ్నంగా ఉన్నట్లే. అలాంటి పని నేనేందుకు చేయాల్సి వచ్చిందంటే నేను జర్నలిజంలో నేర్చుకున్న వాల్యూస్ వల్లే నేను నిజం కోసం పోరాడుతున్నాను అంటూ నేను ఇంటర్వ్యూల కోసం డబ్బు తీసుకోను, మరి ఇంకెందుకు చీప్ పబ్లిసిటీ చేస్తాను అంటూ శ్రీ రెడ్డి మాట్లాడారు.

Bhargavi

Recent Posts

తలనొప్పిని తేలికగా తీసుకుంటున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు!

తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…

4 hours ago

‘హెల్తీ’ అని నమ్మి కొంటున్నారా?.. ముందు ఇది తెలుసుకోండి.!

ఫుడ్ కంపెనీలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్‌లో అడుగుపెడితే ప్రతి రెండో…

6 hours ago

తల్లి గర్భంలో శిశువులు రోజంతా నిద్రపోతారా? పొట్టలో వీళ్లు చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోతారు!

తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…

7 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. దేశ సమగ్రతపై కీలక హెచ్చరిక

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…

9 hours ago

బరువు తగ్గాలని డిన్నర్ మానేస్తున్నారా? ముందు ఈ నిజాలు తెలుసుకోండి!

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…

12 hours ago

కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికేది ఇదేనా? ఆసక్తికర విషయాలు వెలుగులోకి!

పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…

12 hours ago