Koushal: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు అయితే ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ షో ఎంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుందో.. అంత కంటే ఎక్కువగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ పేరు అదిరికీ సుపరిచితమే. హౌస్ లో ఉండగా తన కోసం బయట ప్రత్యేక ఆర్మీని సిద్ధం చేశాడు. హౌస్ లో ఎమోషన్స్, రిలేషన్స్ కి దూరంగా ఉంటూ, గేమ్ ని గేమ్ లా ఆడి టైటిల్ గెలుచుకున్నాడు కౌశల్. ఫైనల్ లో సింగర్ గీతా మాధురితో కౌశల్ పోటీపడి టైటిల్ అందుకోవడం తెలిసిందే. అనేక సినిమాలు, సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా రాబట్టాడు కౌశల్.
ఇక ఇటీవల కౌశల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. బిగ్ బాస్ కు వెళ్లకముందు ఎలా ఉన్నానో.. వెల్లి వచ్చిన తర్వాత కూడా తన జీవితం అలానే ఉందని.. ఏనాడు తనకి ఛాన్స్ లు కావాలని ఎవరినీ అడుక్కోలేదన్నారు. తనకే ఫోన్ చేసి.. ఛాన్స్ ఉంది రమ్మంటే వెళ్లేవాడిని అంటూ చెప్పాడు. తనకు ఆఫర్స్ లేకపోయినా.. ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాన్నాడు.
ఇక వాళ్ల మదర్ గురించి మాట్లాడుతూ.. తన అమ్మకు క్యాన్సర్ ఉన్న సమయంలో ఆసుపత్రిలో వైద్యం కోసం తాను ఓ సినిమాను ఒప్పుకున్నానని.. దానికి తాను రూ.50 వేలు పారితోషికం తీసుకున్నాన్నాడు. కానీ ప్రేక్షకులు ఆ సినిమాను నెగెటివ్ వేలో తీసుకన్నారని.. కొన్నాళ్ల తర్వాత అటువంటి సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రస్తుతం ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాల్లో , సీరియళ్లలో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన జీవితంలో ఉదయ్ కిరణ్ ని ఎన్నడూ మర్చిపోలేనని.. తన పుట్టిన రోజు, డెత్ యానివర్సరీ రోజున తాను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటానన్నారు. తాజాగా అతడు నటించిన ‘‘అతడు ఆమె ప్రియుడు’’ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. అందులో తన క్యారెక్టర్ రైటర్ గా ఉంటుందని అన్నాడు. ఈ సినిమాలో సునీల్ పాత్రని అందరూ ఇష్టపడతారని.. పాత కమెడియన్ సునీల్ ను ఇందులో చూస్తారన్నారు. అతడి క్యారెక్టర్ ప్లే బాయ్ లా ఉంటుందని.. ఉదయం ఒక అమ్మాయి.. మధ్యాహ్నం, రాత్రి ఒక అమ్మాయితో ఫుల్ గా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ సునీల్ ది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందన్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…