Tag Archives: reward points

పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డ్ తో ఇంటి అద్దె చెల్లించే ఛాన్స్..?

డిజిటల్ పేమెంట్స్ సంస్థలలో ఒకటైన పేటీఎం సంస్థ కస్టమర్లకు గత కొన్ని నెలల నుంచి కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పేటీఎం క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా క్రెడిట్ కార్డుల సహాయంతో టికెట్ల బుకింగ్, రీఛార్జ్, ఆన్ లైన్ పేమెంట్స్, షాపింగ్ చేస్తూ ఉంటాం. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా రూమ్ రెంట్ కూడా చెల్లించే ఛాన్స్ అంటే కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.

గతంలో పలు యాప్స్ ద్వారా ఇంటి ఓనర్లకు క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి రెంట్ చెల్లించే అవకాశం ఉండేది. అయితే పేటీఎం ఆ యాప్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రూమ్ రెంట్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. అయితే పేటీఎం క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైతే రూమ్ రెంట్ ను చెల్లిస్తారో వాళ్లు అదనంగా 2 శాతం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదనంగా 2 శాతం చెల్లించినా రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు లభిస్తాయి.

1,000 రూపాయలకు 20 రూపాయల చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరైనా పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి ఆల్ సర్వీసెస్ ఆప్షన్ ను ఓపెన్ చేసి ఆ తరువాత మంత్లీ బిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ రెంట్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంటి ఓనర్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది.

అయితే రూమ్ రెంట్ ను డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. కానీ క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగించే వాళ్లకు పేటీఎం కొత్త సర్వీసుల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఆ బ్యాంక్ లో మహిళల కోసం స్పెషల్ అకౌంట్.. ఎన్నో లాభాలు..?

దేశంలోని బ్యాంకులు రోజురోజుకు కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని బ్యాంకులు అయితే ఏకంగా మహిళల కోసం స్పెషల్ అకౌంట్లు ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ మహిళలకు మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవా పేరుతో మహిళలకు స్పెషల్ అకౌంట్ సర్వీసులను అందిస్తోంది.

మహిళలు ఈ స్పెషల్ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా సాధారణంగా బ్యాంకుల నుంచి పొందే ప్రయోజనాలతో పోల్చి చూస్తే ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేటుతో పోల్చి చూస్తే ఈ అకౌంట్ ను ఒపెన్ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఇవా అకౌంట్లు ఓపెన్ చేసిన మహిళలకు ఏకంగా 7 శాతం వడ్డీని అందిస్తోంది.

మహిళలు ఎవరైతే ఇవా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేస్తారో వాళ్లకు ఉచితంగా హెల్త్ చెకప్, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం మహిళా డాక్టర్లతో మాట్లాడే అవకాశం సైతం ఉంటుంది. మహిళలు ఈ అకౌంట్ ను ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ చార్జీలను సైతం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న మహిళలు గోల్డ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

మహిళలు ఎవరైనా సమీపంలోని ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు వెళ్లి సులభంగా ఈ బ్యాంక్ అకౌంట్ ను తెరవవచ్చు. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డెబిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేస్తే రివార్డ్ పాయింట్లను పొందే అవాకాశం ఉండటంతో పాటు ఈ బ్యాంక్ ఖాతా ఉన్న మహిళలకు లాకర్లపై 25 నుంచి 50 శాతం చార్జీల తగ్గింపు ఉంటుంది.