Tag Archives: royal family

Chitti Babu: లావణ్య రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి… వరుణ్ తెలివిగా లవ్ ట్రాక్ నడిపారు: చిట్టిబాబు

Chitti Babu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య ప్రేమ గురించి నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టిబాబు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల గురించి మాట్లాడుతూ… లావణ్య త్రిపాటి రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కోట్ల ఆస్తులకు వారసురాలు. ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే మెగా ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పదన్న ఉద్దేశంతో వరుణ్ చాలా తెలివిగా లవ్ ట్రాక్ నడిపారు.

ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠినీ ప్రేమించారనే విషయం తెలియడంతో నాగబాబు కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా తనని తన ఇంటి కోడలుగా అంగీకరించారు అంటూ ఈ సందర్భంగా చిట్టిబాబు కామెంట్స్ చేశారు.లావణ్య త్రిపాటి మంచి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి చాలా అందంగా కూడా ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలని ఈయన కామెంట్స్ చేశారు.

Chitti Babu: కోట్ల ఆస్తులకు వారసురాలు…

ఇకపోతే ఈయన చేసిన వ్యాఖ్యలను కొందరు మరోలా అర్థం చేసుకున్నారు. కేవలం ఆస్తి చూసి వరుణ్ తేజ్ తనని ప్రేమించారని అర్థం వచ్చేలా చిట్టి బాబు మాట్లాడుతున్నారంటూ ఈ సందర్భంగా పలువురు మెగా అభిమానులు చిట్టి బాబు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.