Tag Archives: Rs 5 lakh

జగన్ మరో సంచలన నిర్ణయం.. వాళ్లకు 5 లక్షల రూపాయలు..!

తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పలు ప్రాంతాల్లో వరదల వల్ల కొంతమంది మృతి చెందారు. తెలంగాణతో పోలిస్తే మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నా చనిపోయిన వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. దీంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయారని ఈ నెల 31వ తేదీలోపు పంటనష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని.. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా జరగాలని చెప్పారు.

నేడు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన జగన్ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, భారీ వర్షాలు, వరదలు, నాడు నేడు, ఇతర అంశాల గురించి సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు. ఇళ్లు కూలిన వారికి తక్షణమే సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని.. కలెక్టర్లు ఇళ్లు కూలిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.

చనిపోయిన వాళ్ల కుటుంబాలకు పరిహారం అందే విధంగా కలెక్టర్లే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపే బడ్జెట్ ప్రతిపాదనలు కూడా పూర్తి కావాలని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్లను సీఎం అభినందించారు.