Tag Archives: rules

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

Quarantine: విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా రిస్క్ ఉన్న దేశాలు తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కరోనా ఆంక్షలు, క్వారంటైన్ రూల్స్ ని సడలించింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రాకపోకలు కొనసాగించే వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం 14 స్వీయ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని తెలిపింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. నిరంతరం మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ ని పర్యవేక్షించాలనే అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు..

ఓమిక్రాన్ మొదలైనప్పటి నుంచి కొన్ని యూరోపియన్, ఆఫ్రికా దేశాలను హైరిస్క్ దేశాలుగా ప్రకటించింది. అక్కడి నుంచి వచ్చేవారిని నిశితంగా గమనించింది. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రయాణికులపై క్వారంటైన్ రూల్స్ విధించింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు ఊరట లభించింది.  కొత్తగా విధించిన మార్గదర్శకాల్లో విదేశీయులంతా తప్పనిసరిగా… 14 రోజుల ట్రావెల్ హిస్టరీని స్వీయ డిక్లరేషన్ ఫామ్ లో సమర్పించాలి. ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ పరీక్ష ఫలితాలను అప్ లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. సెల్ఫ్ డిక్లరేషణ్ ఫామ్ , నెగిటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ లైన్స్ బోర్డింగ్ కు అనుమతించనున్నారు.

Booster Dose: నేటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం.. ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే..!

Booster Dose: ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం వ్యాక్సిన్స్ వేగవంతం చేసింది . తాజాగా భారతదేశంలో కూడా లక్షా యాభై వేల కరోనా కేసులు నమోదయ్యాయి . ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం బూస్టర్ డోస్ ను ప్రవేశపెట్టింది. ఈ బూస్టర్ డోస్ వేసుకోవటానికి ఎవరు అర్హులు , ఎందుకు వేసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .

Booster Dose: నేటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం.. ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే..!

దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ప్రజల వారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు . అందువల్ల ప్రభుత్వం ఈరోజు నుండి (జనవరి 10) ప్రజలకు బూస్టర్ డోస్ వేయనుంది . ఇప్పటికే దేశంలో 150కోట్లకు పైగా కరోనా వాక్సిన్ అందించారు .

Booster Dose: నేటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం.. ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే..!

ఇప్పటికే 20 మిలియన్ల మంది 15 నుండి18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించారు. కరోనా టీకా వేసుకున్న తర్వాత సమయం గడిచే కొద్దీ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా బూస్టర్‌ డోస్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. ఇంతకుముందు కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ వేయించుకోవచ్చు .

బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులు వీళ్ళే..

కరోనా టీకా రెండవ డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. కరోనా రెండవ డోస్ పోయిన సంవత్సరం జనవరి , మార్చ్ నెలల మధ్య తీసుకున్నట్లయితే ఇప్పుడు బూస్టర్ డోస్ వేస్తారు. కరోనా టీకా రెండు డోస్‌లు తీసుకున్న వారు బూస్టర్‌ డోస్‌ కోసం నేరుగా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. టీకా కేంద్రానికి వెళ్లి బూస్టర్‌ డోస్‌ వేసుకోవచ్చు. బూస్టర్ డోస్ తీసుకోవటానికి అర్హులైన వారికి ప్రభుత్వం నుండి మెసేజ్ వస్తుంది . కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కో వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే బూస్టర్ డోస్ కూడా కోవాక్సిన్ ఇస్తారు . అలాగే మొదటి రెండు డోసులు కోవిషీల్డ్‌ అయితే బూస్టర్ డోస్ కూడా కోవిషీల్డ్ ఇస్తారు. మీరు బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులు అయితే ప్రభుత్వం మీకు మెసేజ్ పంపిన తర్వాత మీరు కోవిన్ ద్వారా బూస్టర్ డోస్ కోసం స్లాట్‌ బుక్ చేసుకోవచ్చు. 

గుడికి వెళుతున్నారా…? అయితే ఈ రూల్స్ తప్పక పాంటించండి..!

దేవుడి భక్తి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానికి కొంత మంది గుళ్ల చుట్టూ తిరుగుతుంటారు. మరికొంత మందికి ఆ అలవాటు ఉండదు. ఇక ఆలయాలు దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమిలోని మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు.

ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించారు. అందుకే అలాంటి ఆలయాల్లో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆలయాల్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

ఆ నియమాలు ఏంటంటే.. ముందుగా గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అక్కడ ఎలాంటి ధ్వజ స్తంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ ప్రదక్షిణ చేసే సమయంలో దాట కూడదు. దేవుడి విగ్రహం కింద నిలబడి ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. దేవాలయంలో దేవుడికి వెనకాల కూర్చోకూడదు. దేవాలయంలోకి ప్రేవేశించిన ఏ భక్తుడు ఏడవకూడదు.

ఖాళీ చేతులతో దేవుడి గుడిలోకి వెళ్ల కూడదు. వస్త్రాలను కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ధరించడానికి వీళ్లేదు. ఇక గుడి దగ్గర యాచించే వాళ్లకు తోచిన సహాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గుడిలోకి జుట్టు విరబోసుకొని వెళ్లకూడదు. దేవుడికి ఎదురుగా నష్టాంగ నమస్కారం చేయకూడదు.

ఏపీ ప్రజలకు అలర్ట్.. దీపావళికి పాటించాల్సిన నిబంధనలివే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రేపు దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని ప్రజలు రేపు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చటానికి అనుమతులు ఇచ్చింది. గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ పండుగ నేపథ్యంలో బాణసంచా కాల్చటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బాణసంచాను బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాల్చాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాణసంచాను అంటించిన తరువాత పేలని పక్షంలో దానిని ప్రత్యక్షంగా తాకకుండా నీళ్లు చల్లాలని తెలిపారు. డబ్బాల్లో, సీసాల్లో బాణసంచా ఉంచి కాల్చవద్దని పేర్కొన్నారు. గుడిసెలు, వాములు, పెట్రోల్ బంకులకు దూరంగా బాణసంచాను కాల్చాలని చెప్పారు. పిల్లలు, అనారోగ్యంతో బాధ పడేవాళ్లు, ముసలివాళ్లు తక్కువ శబ్దం ఉన్న బాణసంచా కాల్చాలని సూచించారు.

అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక చికిత్సా సామాగ్రిని తయారు చేసుకోవాలని సూచనలు చేశారు. పర్యావరణహితమైన బాణసంచాను మాత్రమే కాల్చాలని చెప్పారు. పెద్దల సమక్షంలోనే పిల్లలు బాణసంచా కాల్చాలని తెలిపారు. కార్యాలయాలకు, ఆస్పత్రులకు దూరంగా బాణసంచా కాల్చాలని పేర్కొన్నారు.

అగర్ బత్తీలు, కొవ్వొత్తుల సహాయంతో బాణసంచా కాల్చాలని.. అగ్గిపెట్టెలను ఎక్కువగా ఉపయోగించకూడదని తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉండాలని చెప్పారు. బాణసంచాను గురింపు పొందిన దుకాణాలలో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.