Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?
Quarantine: విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా రిస్క్ ఉన్న దేశాలు తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కరోనా ఆంక్షలు, క్వారంటైన్ రూల్స్ ని సడలించింది.
ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రాకపోకలు కొనసాగించే వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం 14 స్వీయ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని తెలిపింది.
ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. నిరంతరం మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ ని పర్యవేక్షించాలనే అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
ఓమిక్రాన్ మొదలైనప్పటి నుంచి కొన్ని యూరోపియన్, ఆఫ్రికా దేశాలను హైరిస్క్ దేశాలుగా ప్రకటించింది. అక్కడి నుంచి వచ్చేవారిని నిశితంగా గమనించింది. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రయాణికులపై క్వారంటైన్ రూల్స్ విధించింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు ఊరట లభించింది. కొత్తగా విధించిన మార్గదర్శకాల్లో విదేశీయులంతా తప్పనిసరిగా… 14 రోజుల ట్రావెల్ హిస్టరీని స్వీయ డిక్లరేషన్ ఫామ్ లో సమర్పించాలి. ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ పరీక్ష ఫలితాలను అప్ లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. సెల్ఫ్ డిక్లరేషణ్ ఫామ్ , నెగిటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ లైన్స్ బోర్డింగ్ కు అనుమతించనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…