Categories: FeaturedMovie News

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

Mahesh Babu-Radha: సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి సినిమా విడుదలై దాదాపు చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. దీనికి సంబంధించి ఇటీవల మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుకు సర్జరీ అవ్వడం.. కరోనా పాజిటివ్ రావడం లాంటివి జరగడంతో సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‏గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

త్రివిక్రమ్ కు ఇలా చేయడం అలవాటే..

ఈ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మహేష్ బాబుకు తల్లి క్యారెక్టర్ లో ఆమె పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఇక 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాధా వివాహం తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు. ఈ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఆమె అభిమానులు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నారు. తమ అభిమాను హీరోయిన్ ను మళ్లీ సినిమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లను తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం త్రివిక్రమ్ కు మొదటి నుంచి కూడా అలవాటే. అత్తారింటికి దారేదిలో నదియాకు,
అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులకు అవకాశం ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago