Bhairava Dweepam: భైరవ ద్వీపం సినిమా సెన్సార్ విషయంలో అంత కథ నడిచిందా.. గుర్రాల కోసం వార్నింగ్?
Bhairava Dweepam: సింగీతం శ్రీనివాస రావు-బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన ‘ ఆదిత్య 369‘ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తరువాత వచ్చిన ‘ భైరవ ద్వీపం’ కూడా పెద్ద హిట్ గా నిలిచింది.
1994వ సంవత్సరంలో ఎప్రిల్ 14న ఈ విడుదలైన ఈ మూవీ అన్ని సెంటర్లలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఏకంగా అన్ని విభాగాల్లో మొత్తం 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది.
బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించింది. జానపద చిత్రంగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఓ సామాన్య వీరుడు.. ఓ రాజు కుమర్తెను భైరవుడనే మాంత్రికుడి నుంచి రక్షించే కథతో ఈ సినిమా వచ్చింది. రావి కొండలరావు అందించిన కథ, మాటలు, మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి
ఇదిలా ఉంటే ‘ భైరవ ద్వీపం’ సెన్సార్ సమయంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన సంఘటన ఎదురైందట. అయితే ముందుగా అనుకున్న ప్రకారం సినిమాకు సెన్సార్ జరిగింది. అయితే చిత్ర యూనిట్ కు మాత్రం ఓ విషయంలో వార్నింగ్ ఇచ్చారట. మా వరకు సినిమాపై ఎలాంటి అభ్యంతరం లేదని.. కాకపోతే బాణాలకు గుర్రాలకు తగిలి పడిపోయిన సీన్లు కొన్ని ఉన్నాయని.. వాటికి అభ్యంతరం వ్యక్తం అవ్వచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయట. వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్లు ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారట. అలా జరిగితే ఆ సీన్లను తొలగించవచ్చు అని కోరే అవకాశం ఉందని అన్నారు. అయితే సినిమా విడుదలయ్యాక వీటిని ఏమాాత్రం పట్టించుకోలేదు. సినిమా సూపర్ హిట్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…