Ten Rupee Coin: రూ.10 కాయిన్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!చెల్లుతుందా..? చెల్లదా..?
Ten Rupee Coin: ఏదైనా కొనుగోలు కోసం దుకాణానికి వెళ్లి.. సరుకులు తీసుకున్న తర్వాత రూ.10 నాణెం ఇస్తే.. ఇది చెల్లదు వేరేది ఇవ్వండి అనడం మనం ఎన్నోసార్లు చూశాం. నిత్య జీవితంలో చాలా మందికి ఈ పరిణామం ఎదురయ్యే ఉంటుంది.
రూ. 10 నాణేం అసలు చెల్లుతుందా.. చెల్లదా..? అనే సందేహాల నడుమ దీన్ని లావాదేవీల్లో ఉపయోగించని పరిస్థితి ఎదురైంది. ఆర్బీఐ చాలా సార్లు దీనిపై అవగాహన కల్పించినా కూడా.. రూ. 10 నాణేం వాడకంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.
అయితే తాజాగా ఇటీవల ఈ అంశం లోక్ సభలో ప్రస్తావనకు వచ్చింది. తమిళనాడుకు చెందిన ఎంపీ ఏ. విజయ్ కుమార్ అసలు రూ. 10 నాణెం చెల్లుతుందా.. లేదా..? అని రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా దీనికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అనుమానాలను తొలగించేందుకు ఆర్బీఐ..
రూ. 10 నాణెంపై స్పందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించబడి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా పంపిణీ చేయబడిన రూ. 10 నాణేలు చట్టబద్ధం అయినవని స్పష్టం చేశారు. అన్ని లావాదేవీలకు చట్టపరమైన టెండర్ గా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రూ.10 నాణెంపై ప్రజలకు అపోహలు, అనుమానాలు ఉన్నాయని, ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయని కేంద్రమంత్రి అన్నారు. అయితే వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అనుమానాలను తొలగించేందుకు ఆర్బీఐ పత్రికా ప్రకటనలు జారీ చేస్తుందని వివరణ ఇచ్చారు. రూ. 10 నాణెంపై ఎలాంటి అనుమానాలు లేకుండా లీగల్ టెండర్ గా అంగీకరించాలని కోరారు. ఆర్బీఐ రూ.10 నాణెం మొత్తం 14 డిజైన్‌లు చెల్లుబాటు అవుతాయని , లావాదేవీలకు చట్టబద్ధమైన టెండర్ గా అంగీకరించాలని చెప్పారు. ఆర్బీఐ తొలిసారిగా రూ. 10 కాయిన్‌ను 2005లో ప్రవేశపెట్టింది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…