Tag Archives: saidabad

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా.. వైఎస్ షర్మిల

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆరేళ్ల చిన్నారి చైత్రను రాజు అనే దుండగుడు ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటు సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రతీ ఒక్కరు గాలిస్తున్నారు.

ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ పోలీసులు రూ.10 లక్షలు రివార్డు కూడా ఇస్తానని ప్రకటించారు. దానికి సంబంధించి నిందితుడి ఫొటో, ఆనవాళ్లను కూడా షేర్ చేశారు. ఇప్పటికే అతడి ఫొటో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, మీడియాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిపోయింది. కానీ అతడి ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. అయితే దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.

వాళ్ల కుటుంబసభ్యులను ఆమె కలిసి ఓదార్చారు. ఆ చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతనాని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. మరోవైపు బాధిత కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వెచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు..

ఇంత పెద్ద ఘటన జరిగినా వాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఈ ప్రాంతమంతా దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ రాకపోవడం దురదృష్టకరం అని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేసీఆర్ నోరు విప్పి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

సైదాబాద్ చిన్నారి అత్యాచారంపై స్పందించిన నాని.. వాడు బయట ఉండకూడదంటూ…

సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటన యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతో కృంగ తీసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని పట్ల అంత దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు స్పందించారు. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డను అంత దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఆ నిందితుడిని ఈ భూమిపై ఉండకూడదని అతనిని ని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు మంచు మనోజ్ ఈ విషయంపై స్పందించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు కఠినంగా శిక్షపడేలాని తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా మీడియాను ఉద్దేశించి మీడియా ఇలాంటి వారి పట్ల ఫోకస్ చేసి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడమని తెలిపారు. అదే విధంగా ఈ చిన్నారి ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ ఇంతగా దిగజారిపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం.. ఈ సమాజంలో మన బిడ్డలు ఎలా బతకాలి అంటూ స్పందించారు.

ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలు నిందితుడు రాజు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల నగదును పోలీసులు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నారి ఘటనపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. ఈ సందర్భంగా నాని స్పందిస్తూ బయటేక్కడో ఉన్నాడు.. ఉండకూడదు అంటూ సింపుల్ గా తన వైల్డ్ రియాక్షన్ చూపించారు.

అదే విధంగా దర్శకుడు ఈ ఘటన పై స్పందిస్తూ నిందితుడు బయట తిరుగుతున్నాడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి..అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ ప్రతి ఒక్కరు ఈ చిన్నారి అత్యాచార ఘటన పై స్పందిస్తూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

భావోద్వేగానికి గురైన మంచు మనోజ్.. ఆ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్..

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో నాలుగు రోజుల క్రితం దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారుతోంది. చిన్నారి హత్య కేసులో సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని ఆరు సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టి.. ఆ చిన్నారిని ఎత్తుకు వెళ్లి ఆత్యాచారం చేసి హత్య చేశాడు.

ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అతడి ఇంట్లోనే చాపలో చుట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ రోజు నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఘటన జరిగిన సమయంలోనే తమకు న్యాయం చేయాలి అంటూ తల్లిదండ్రులు.. బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై ఆందోళనకు ఎక్కువ కావడంతో.. పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఘటన జరగిన సమయంలో వాళ్లు కాస్త శాంతించారు. కానీ ఇంతవరకు అతడిపై చర్యలు తీసుకోలేదు.

చిన్న చిన్న విషయాలను మీడియాలో బూతద్దం పెట్టి చూపించే ఈ మీడియా ఇలాంటి ఘటనలపై ఎందుకు తీవ్రంగా స్పందించరని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సామాజిక అంశాలలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. బాధిత తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లిన మంచు మనోజ్ ఆ తల్లిదండ్రులు తన కాళ్లమీద పడి ఏడుస్తుంటే.. తను ఏమీ చేయలేని ఓ అసమర్థుడిలా భావన కలిగింది అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

https://youtu.be/3ulpOr2hT6U

అతడు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అతడు ఎవరి కంట పడినా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మీడియా ప్రతినిధులు కూడా వీళ్లకు న్యాయం చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.