Tag Archives: sandalwood

Jaggesh: చేతిలో చిల్లిగవ్వ లేదు తండ్రిగా ఓడిపోయా చివరకు గుడి ముందు అలా.. !

Jaggesh: కన్నడ నటుడు జగ్గేష్ తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన ఆలోచనలను పంచుకుంటాడు. ఎప్పుడూ ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే అతడు కేవలం సినిమాలకే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా సమాచారాన్ని అందజేస్తున్నారు. ఇలా అతడు తన అభిమానులకు దగ్గర అవుతూ ఉన్నాడు.

జగ్గేష్ వెండితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అతడికి అదే డిమాండ్ ఉంది. చాలా బిజీగా ఉన్నప్పటికీ.. జగ్గేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటారు. తన ఆలోచనలకు పంచుకుంటూ.. సమస్యలను పంచుకుంటూ దగ్గర అయ్యాడు.

ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. సినిమాకు తక్కువ కాదనే రేంజ్ లో ఉంటుంది. అతడి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఎన్నటికీ మర్చిపోలేము అన్నట్లు పేర్కొన్నాడు. అలాంటి కొన్ని సంఘటనలను ఆయన తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

నా చేతిలో చిల్లిగవ్వ లేదు..


మంగళవారం (జనవరి 5) ఆయన పెద్ద కుమారుడు గురురాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఇది తన కొడుకు గురించి భావోద్వేగపూరితమైన పోస్టును ట్విట్టర్ లో పోస్టు చేశాడు. 1987 సంవత్సరంలో తాను తండ్రిని అయ్యానని.. అప్పడు తన దగ్గర చిల్లి గవ్వలేదని.. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలన్న భయం ఎక్కువగా వెంటాడిందన్నారు. అప్పడు ఆర్థికంగా తన కొడకుతో సమానంగా ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిగా తాను ఓడిపోయానని.. దిక్కుతోచని స్థితిలో మంత్రాలయం గురురాయర ముందు నిలిచి నా గోడును చెప్పుకున్నా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ప్రస్తుతం అతడి ట్వీట్ వైరల్ గా మారింది..

సొంత తమ్ముడిని హత్య చేసిన హీరోయిన్..అది కూడా పక్కా ప్లాన్ తో.. అసలేం జరిగిందంటే..??

వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది నిజం.. ప్రియుడి మోజులో సొంత అన్ననే చంపించింది ఆ కసాయి హీరోయిన్. తమ ప్రేమను వ్యతిరేకిస్తున్న అన్నయ్యను ప్రియుడితో కలిసి ఆ హీరోయిన్ అతి కిరాతకంగా మెడ, మొండి వేరు చేసి చంపించింది. ఇంతటి దుర్మార్గమైన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి నగర శివారు దేవరగుడిహళ్లిలో చోటుచేసుకుంది.దేవరగుడిహళ్లిలోని చెత్త కుప్పలో కేవలం మొండం మాత్రమే ఉన్న ఒక యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే తల కనిపించకపోవడంతో ఆ శవం ఎవరిది అనేది తేలలేదు. కానీ సాయంత్రానికి తల దొరికింది. దీంతో యువకుడి గుర్తింపు సాధ్యమైంది.చనిపోయింది నగరానికే చెందిన రాకేష్ అని.. రెండు రోజులుగా కనిపించడం లేదని పోలీసులు విచారణలో కనిపెట్టారు. రాకేష్ కాల్ డేటా.. కుటుంబం, ఇతర వ్యవహారాలు విచారించగా అసలు విషయం బయటపడింది.రాకేష్ కు సోదరి కర్ణాటకలో హీరోయిన్ గా కొనసాగుతున్న నయన. ఈమె ఇప్పటికే కన్నడలో రెండు సినిమాల్లో నటించింది.

అయితే నయన కొద్దిరోజులుగా నియాజ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. వేరే మతస్థుడు కావడంతో రాకేష్ అక్క ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అక్కను ప్రేమించొద్దంటూ హెచ్చరిస్తున్నాడు. వీరి ప్రేమకు అడ్డుపడుతున్నాడు.అయితే మన ప్రేమకు అడ్డుగా ఉన్న మీ సోదరుడిని ఏం చేద్దాం అని ప్రియుడు నియాజ్ అడగ్గానే చంపేద్దామని హీరోయిన్ నియాన్ చెప్పిందని పోలీసుల విచారణలో తేలింది.

దీంతో పక్కా ప్లాన్ తో నియాజ్, తన స్నేహితులైన తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే మరో ముగ్గురితో కలిసి రాకేష్ ను అతి కిరాతకంగా చంపేశాడు. అతడి తల మొండెం వేరు చేసి హత్య చేశారు.కేవలం తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే సొంత తమ్ముడిని చంపించిన హీరోయిన్ నయన వ్యవహారం సంచలనమైంది. పోలీసులు నిగ్గుతేల్చి నియాజ్ తోపాటు నలుగురిని , నయనను పోలీసులు అరెస్ట్ చేశారు…!!