వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది నిజం.. ప్రియుడి మోజులో సొంత అన్ననే చంపించింది ఆ కసాయి హీరోయిన్. తమ ప్రేమను వ్యతిరేకిస్తున్న అన్నయ్యను ప్రియుడితో కలిసి ఆ హీరోయిన్ అతి కిరాతకంగా మెడ, మొండి వేరు చేసి చంపించింది. ఇంతటి దుర్మార్గమైన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లి నగర శివారు దేవరగుడిహళ్లిలో చోటుచేసుకుంది.దేవరగుడిహళ్లిలోని చెత్త కుప్పలో కేవలం మొండం మాత్రమే ఉన్న ఒక యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అయితే తల కనిపించకపోవడంతో ఆ శవం ఎవరిది అనేది తేలలేదు. కానీ సాయంత్రానికి తల దొరికింది. దీంతో యువకుడి గుర్తింపు సాధ్యమైంది.చనిపోయింది నగరానికే చెందిన రాకేష్ అని.. రెండు రోజులుగా కనిపించడం లేదని పోలీసులు విచారణలో కనిపెట్టారు. రాకేష్ కాల్ డేటా.. కుటుంబం, ఇతర వ్యవహారాలు విచారించగా అసలు విషయం బయటపడింది.రాకేష్ కు సోదరి కర్ణాటకలో హీరోయిన్ గా కొనసాగుతున్న నయన. ఈమె ఇప్పటికే కన్నడలో రెండు సినిమాల్లో నటించింది.
అయితే నయన కొద్దిరోజులుగా నియాజ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. వేరే మతస్థుడు కావడంతో రాకేష్ అక్క ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అక్కను ప్రేమించొద్దంటూ హెచ్చరిస్తున్నాడు. వీరి ప్రేమకు అడ్డుపడుతున్నాడు.అయితే మన ప్రేమకు అడ్డుగా ఉన్న మీ సోదరుడిని ఏం చేద్దాం అని ప్రియుడు నియాజ్ అడగ్గానే చంపేద్దామని హీరోయిన్ నియాన్ చెప్పిందని పోలీసుల విచారణలో తేలింది.
దీంతో పక్కా ప్లాన్ తో నియాజ్, తన స్నేహితులైన తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే మరో ముగ్గురితో కలిసి రాకేష్ ను అతి కిరాతకంగా చంపేశాడు. అతడి తల మొండెం వేరు చేసి హత్య చేశారు.కేవలం తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే సొంత తమ్ముడిని చంపించిన హీరోయిన్ నయన వ్యవహారం సంచలనమైంది. పోలీసులు నిగ్గుతేల్చి నియాజ్ తోపాటు నలుగురిని , నయనను పోలీసులు అరెస్ట్ చేశారు…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…